📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vaasthu: సింహద్వారం ఎలా నిర్ణయించాలి?

Author Icon By Digital
Updated: June 24, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వీధిలో నుండి ఇంట్లోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ప్రథమ ద్వారాన్ని ‘ప్రధాన ద్వారం’ లేక ముఖ ద్వారం ‘సింహద్వారం‘ అంటారు. ఇంట్లో నుండి మనం వీధిలోకి నడిచే నడక మన జీవితపు నడకనే మారుస్తుంది. ఉచ్ఛస్థానం నుండి మన నడక సాగితే బతుకు ఉన్నతమవుతుంది. నీచస్థానం నుండి నడక సాగితే బతుకూ నీచ స్థితికి వెళ్తుంది. అందువల్ల ప్రధాన ద్వారం విషయంలో తగిన జాగ్రత్త ఒక్కసారి తీసుకుంటే దాని మంచి ఫలితాలు జీవితాంతం కనిపిస్తాయి.

తూర్పు ముఖద్వారం
గృహానికి తూర్పున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది ‘తూర్పు ముఖద్వారం‘ అవుతుంది. ఆ గృహానికి తూర్పున ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి ఉత్తరం వైపు వచ్చే సగ భాగంలో ప్రధాన ద్వారం ఏర్పరచుకుంటే అది ఉచ్చస్థానంలో అమరి శుభ ఫలితాలనిస్తుంది.

ఉత్తర ముఖద్వారం
గృహానికి ఉత్తర భాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేస్తే అది ‘ఉత్తర ముఖ ద్వారం’ అవుతుంది. ఆ గృహానికి ఉత్తర భాగంలో ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి తూర్పు వైపు వచ్చే సగ భాగంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పరచుకోవడం ఉత్తమం.

పడమర ముఖద్వారం
గృహానికి పడమర ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే దానిని పడమర ముఖద్వార గృహం అంటారు. ఆ గృహానికి పడమరలో ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి, ఉత్తరం వైపు వచ్చే సగ భాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

దక్షిణ ముఖద్వారం
గృహానికి దక్షిణంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది దక్షిణ ముఖద్వార గృహం అవుతుంది. ఆ గృహానికి దక్షిణంలో ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి, తూర్పున వచ్చే సగ భాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవాలి.

పై పద్ధతుల్లో ప్రధాన ద్వారం ‘ఉచ్చం’లో అమరుతుంది.

తూర్పు ముఖద్వార గృహాలు
గృహానికి తూర్పు భాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేస్తే అది తూర్పు ముఖద్వార గృహం అవుతుంది. ఆ గృహానికి తూర్పున ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి ఉత్తరం వైపు సగ భాగంలో ప్రధాన ద్వారం ఏర్పరచుకుంటే అది ఉచ్ఛస్థానంలో అమరినట్లు శుభ ఫలితాలనిస్తుంది.
తూర్పున సింహద్వారం ఉచ్ఛస్థానంలో వుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

దక్షిణ ముఖద్వార గృహాలు
గృహానికి దక్షిణంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేస్తే అది దక్షిణ ముఖద్వార గృహం అవుతుంది.ఆ గృహానికి దక్షిణాన ఉన్న గదిలోపలి కొలతను సగం చేసి, తూర్పున వచ్చే సగభాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. పై పద్ధతుల్లో ప్రధాన ద్వారం ‘ఉచ్ఛం’లో అమరుతుంది.

దక్షిణ సింహద్వారం
ఉచ్ఛస్థానంలో వుంటే శుభాలు కలిసివస్తాయి.

పడమర ముఖద్వార గృహాలు
గృహానికి పడమరలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తే అది పడమర ముఖద్వార గృహం అవుతుంది.
ఆ గృహానికి పడమరలో ఉన్న గది లోపలి కొలతను సగం చేసి, ఉత్తరం వైపు వచ్చే సగ భాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవటం మంచిది.
పడమర సింహద్వారం ఉచ్ఛస్థానంలో వుంటే అభ్యున్నతి ఇస్తుంది.

ఉత్తర ముఖద్వార గృహాలు
గృహానికి ఉత్తర భాగంలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేస్తే అది ఉత్తర ముఖద్వార గృహం అవుతుంది.
ఆ గృహానికి ఉత్తరాన ఉన్న గది లోపలి కొలతను సగం చేసి, తూర్పు వైపు వచ్చే సగ భాగంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
ఉత్తర సింహద్వారం ఉచ్ఛ స్థానంలో వుంటే కలిసివస్తుంది.

East facing house Google news Home vastu remedies Latest News in Telugu Main entrance vastu North facing house Positive energy entrance Simhadwaram vastu South facing house Telugu News online Telugu News Paper Telugu News Today tips for main door Today news West facing house

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.