Vastu Tips for Home:“సుప్తే గృహపతే మృత్యుః” అని శాస్త్ర వచనం. అంటే ఏ గృహమైతే ‘సుప్తక వేధ’ అనే దోషాన్ని కలిగి వుంటుందో ఆ గృహం యజమానికి, అందులో నివసించే వారికి మృత్యువు కలుగజేయును, లేదా దరిద్రులుగా చేస్తుంది. ‘సుప్తక వేధ’ అంటే ఏమిటి? సుప్తం అంటే నిద్రించుట లేదా నిద్రించునది అని అర్థం.
శ్లో॥ సుప్తి స్పర్శాజ్ఞనిద్రివిశ్రంభే శయనే స్త్రియాం.
కనుక ఏ క్షేత్రంలోనయితే గృహ నిర్మాణం చేపట్టామో ఆ క్షేత్రం(భూమి) నిద్రిస్తున్న సమయంలో గృహ నిర్మాణం (Home construction) చేసినట్లయితే ఆ గృహం “సుప్తక వేధ’ అనే దోషం పొందుతుంది. భూమి నిద్రిస్తున్న సమయాన్ని ఎలా తెలుసుకోవాలి? దానికి ప్రామాణికత ఏమిటి?
శ్లో॥ ప్రద్యోతనా త్సంచనగాంక సూర్య నవెందు షడ్వంశ నుతేఘ భేషు శేతే మహినైవ గృహం విధేయం
తతొగ వాపి ఖననం నశస్తం (వాస్తు రత్నావళి). తా॥ సూర్యుడు ఉన్న నక్షత్రం మొదలు 5, 7, 9, 12, 19, 26 నక్షత్రాల్లో భూమి నిద్రిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రాల (stars) యందు గృహం మొదలైన వాటిని నిర్మించకూడదని వాస్తు రత్నావళి అనే వాస్తు గ్రంథంలో పేర్కొన్నారు. ఎ
ఈశాన్యం తెగిపోవటం అంటే?
ఇల్లుగానీ స్థలంగానీ ఈశాన్య మూలలో(మూలమట్టం 90 డిగ్రీలు) కంటే ఎక్కువ ఉండటం వలన ఈశాన్యం తెగిపోతుంది.
స్థల స్వరూపం ఇలా ఉండటానికి రెండు కారణాలు ఉంటాయి. ఎ) ఉత్తర వాయువ్యం పెరగటం. బి) తూర్పుపెరగటం. బి) తూర్పు ఆగ్నేయం పెరగటం.
ఎ) ఈశాన్యం తెగిపోతూ ఉత్తర వాయువ్యం పెరగటం వలన అనేక విధాల ఆర్థికనష్టాలు, దురలవాట్లు కలిగే అవకాశం ఉంటుంది.
బి) ఈశాన్యం తగ్గుతూ తూర్పు ఆగ్నేయం పెరగటం వలన ఆర్థిక నష్టం, మానసిక ఆందోళన మొదలైన చెడు ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీటిని సులభంగా సరిచేసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు.
2) ఈశాన్యం లోపించటం:
స్థలంగానీ, గృహంగానీ ఈశాన్య మూలలో లోపలికి నొక్కుకుపోయి ఉండటం. ఈ విధంగా ఈశాన్యం తెగిపోవటం వలన సర్వతోముఖాభివృద్ధి కుంటుబడుతుంది.
అంటే అన్ని విధాలైన అభివృద్ధి ఆటంకాలతో ఆగిపోతూ ఉంటుంది. ఇటువంటి స్థలాలను సులభంగా సరిచేసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు.
3) ఈశాన్యం తిరిగి ఉండటం:
సాధారణంగా తూర్పు, ఉత్తరాలలో వీధులతో వచ్చే ఈశాన్య స్థలాలు ఇటువంటి దోషషలకు గురవుతూ ఉంటాయి. రవాణా సౌలభ్యం కోసం భద్రత కోసం మూలస్థలాలని ఇలా మలుపు తిప్పుతారు.
అందువల్ల అన్ని మూల స్థలాలకు కూడా (ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం మూలమట్టం 90 డిగ్రీల స్థాయి భంగమవుతుంది.
ప్రత్యేకించి ఈశాన్య మూల స్థలం ఈ విధంగా తెగిపోవటం వలన ఈశాన్యం లోపించి వ్యాపార వ్యవహారాలలో సత్ఫలితాలు పొందటం దుర్లభం అయ్యే అవకాశం ఉంటుంది. వీలుని బట్టి సరిచేసుకొని మంచి ఫలితాలు పొందవచ్చు.
Read also: hindi.vaartha.com
Read also: Vastu For Income : ఆర్థిక ఇబ్బందులను ఎలా అధిగమించాలి