📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

vastu for home :శంకపాలక వేధ అంటే

Author Icon By Hema
Updated: July 30, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘శంకపాలం జంఘహీనం’, శంకపాలేకు రూపం స్వాత్ ||
vastu for home:ఏ గృహమైతే స్తంభాలు లేకుండా ఉంటుందో ఆ గృహం ‘శంకపాలం’ అనే వేదా దోషాన్ని కలిగి ఉంటుంది.

బరువు భారం వహించే కుడ్యాలు ఉన్న గృహం స్తంభాలు లేకున్నా, గోడలే స్తంభాలుగా వ్యవహరిస్తాయి. కనుక ఇలాంటి దోషం కలగదు.

శాస్త్రవచనానుసారం ‘శంకపాల వేధాదోషం గల గృహం యజమానికి, అందులో నివసించే వారికి అనారోగ్య(sick)

సమస్యలను ముఖ్యంగా అందవిహీనులుగా చేసే దుష్ఫలితం కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సమాజంలో

దాదాపు ప్రతి గృహం(home) కూడా స్తంభాలు (పిల్లర్స్) తోనే నిర్మిస్తున్నారు.కనుక గృహాలను బట్టి ‘శంకపాలక వేధా దోషం కలిగే అవకాశాలు తక్కువ.

పాత కాలంలో నిర్మించిన భవంతీ’ గృహాలలోగానీ,
పెంకుటిండ్లలోగానీ పై దూలాలను లేదా పై కప్పును గానీ దృఢమైన కలప స్తంభాలు
కూడా గృహంలోని స్తంభాల శ్రేణిలోకే వస్తాయి. దిగ్వక్రత్వం వికట వేధ వికటం స్మృతం |

|వికటప్పధుకే రమ్యే విశాల కరాళయో! //

(నానార్థ రత్నమాలు ‘వికటం’ అంటే విస్తారమైనదనీ, మిక్కిలి భయంకరమైనదనీ అర్థం.
సింహద్వారం వికటంగా వున్నట్లయిత ‘వికటం’ అనే వేదాదోషమేర్పడుతుంది.

ఒక గృహానికుండే
సింహద్వారం ఆ గృహానికుండే అన్ని కంటే పెద్దగా, రమణీయంగా ద్వారాల ఉండాలని వాస్తు నియమం.

అంతేగానీ ఒక సింహద్వారం సహజంగా ఉండవలసిన పొడవు, వెడల్పుల కంటే మించి అసహజంగా, అతిగా ఉన్నా, భయంకరంగా కనిపించేలా ఉన్నా ‘వికట వేధా దోషం’ వల్ల తీరని నష్టాలు కలిగే అవకాశాలున్నాయి.

దోషం తెలుసుకొని సవరించుకోవడం వల్ల
శీఘ్రంగా సత్ఫలితాలను పొందవచ్చు.

ప్రత్యామ్నాయ మార్గాలు? ఎస్. కార్తికేయ, గద్వాల

ప్రశ్న: మా ప్రధాన ద్వారంలోకి భూగర్భంలో బోరు, నీళ్లసంపు, పంపుమోటర్లు ఉన్నాయి. వాటిని మార్చడానికి గానీ, మెయిన్ గేటును మార్చడానికిగానీ వీలు లేదు.

ఇలా ఉండటం ఇంటికి
క్షేమదాయకమేనా? లేక ఏమైనా ప్రత్యామ్నాయమార్గాలున్నాయా?
జవాబు: ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడనివి ఎన్నో ఉన్నాయి.

అందులో మీరు
పేర్కొన్నవి కొన్ని. ఇవన్నీ ప్రధాన ద్వారానికి ఎదురుగా రాకూడదు. బయట నుండి ఇంట్లోకి
గానీ, ఇంట్లో నుండి బయటకుగానీ వచ్చేటపునపడు

వీటిపై నడుచుకుంటూ వెళ్లకూడదు.
తప్పకుండా సరైన స్థానంలోకి వీటిని మార్చాలి.

అండర్ గ్రౌండ్లోనే బోరుని పైపుతో మరొక దిశకి
మార్చడం మినహా చేయగలిగింది ఏమీ లేదు.

వీటన్నింటినీ మార్చే అవకాశాలు లేకపోతే ద్వారాన్ని వాస్తు పరంగా అనువైన చోటుకి మార్చే వీలుందేమో చూడండి.

ఇటువంటి సందర్భాలలో వాస్తు నిపుణులకు గృహాన్ని ప్రత్యక్షంగా చూపించి వీలైనన్ని సవరణలు చేయించుకుంటే
మంచిది.

ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. కానీ అన్ని సందర్భాలలో ఇవి కుదరవు. మీ విషయంలో తప్పకుండా మార్పులు చేసుకోవాలి. అవసరమైన మార్పులు చేసి
సత్ఫలితాలు పొందండి.

Read also: hindi.vaartha.com

Read also: Vastu Tips for Home :సుప్తక వేధ” అంటే ఏమిటి?

PillarlessHouseWarning ShankapalakaVedha TraditionalVastu VastuDosha VastuForHome

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.