📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Reasons For Divorce : విడాకులకు కారణం?

Author Icon By venkatesh
Updated: July 18, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Reasons For Divorce : సమాజం మారింది ఎందుకంటే ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు మనకి భారతదేశంలో, హిందూ ధర్మంలో(Hindu Dhrama), హిందూ వివాహ వ్యవస్థలో విడాకులే లేవు. ఒక పెళ్లి చేస్తున్నారంటే పెద్దలు అన్ని విషయాలు, ఆలోచించి చేసేవాళ్లు. దానికి పిల్లలు కట్టుబడి ఉండేవాళ్లు. ఎక్కువ వయసు వచ్చేదాకా పెళ్లి చేయకుండా ఆగేవాళ్లు కాదు. ఇప్పటి సమాజం ‘బాల్య వివాహ వ్యవస్థ’ సరైనది కాదు అని నిర్ధారణ చేసింది. కానీ ఒకప్పటి సమాజంలో ఆ బాల్య వివాహ వ్యవస్థనే సరైనది. బాల్య వివాహాలు కాకుండా, మరీ వయసు పెరిగిన వివాహాలు కాకుండా మధ్యే మార్గంగా సరైన వయసులో వివాహం చేయటం శ్రేష్టమైన పద్ధతి.

చిన్నప్పుడే ఇద్దరికీ పెళ్లిళ్లు చేసినప్పటికీ, వయస్సు పెరిగి వాళ్లకి ఊహ తెలిసి వచ్చేసరికి భార్యాభర్తలుగా వున్న ఆ పిల్లలు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చేది. లేదా ఒకరికొకరు అర్థం అయ్యే పరిస్థితి వచ్చేది. కొంత కాలం తర్వాత ఒక అవగాహనలో వీళ్లకు ఒక పరస్పర బంధం ఏర్పాటు అయిపోయేది. ఇటువంటి వ్యవస్థలో ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టపోయిన వాటిని మాత్రమే చూపించి ‘మానసిక పరిపక్వత అనేదాన్ని ముఖ్యంగా పేర్కొంటూ ఆ పాత తరం వివాహ వ్యవస్థనే సమూలంగా మార్చేశారు.

ముఖ్య కారణాలు: ఇదివరకు పెద్దలు ఆలోచించి, మంచి-చెడులు బేరీజు వేసుకొని, రెండు వైపులా కుటుంబాల తరాలను సామాజికంగా, ఆరోగ్య పరంగా విచారించి, పిల్లల పెళ్లి గురించి ఒక నిర్ణయం తీసుకునేవాళ్లు. ఇప్పుడు ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఒక రకం మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఆ మెచ్యూరిటీ వచ్చింది అనుకునేవాళ్లు ఎక్కువగా కమర్షియల్గా ఆలోచిస్తూ ‘పెళ్లి’ అనేదాన్ని కూడా ఒక వ్యాపార అవకాశంగా వాడుకుంటున్నారు.

ఇటువంటప్పుడు వివాహ వ్యవస్థలో మనసు, అవగాహన, ఆరోగ్యం, బంధం లాంటివి మృగ్యం అయిపోతాయి. వివాహం అనేది ఆర్థిక పరమైన వ్యవహారం అయిపోయింది. కానీ అసలు విషయం ఏమిటంటే పెళ్లి చేసుకున్న తర్వాత “భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడి, జీవితం కొనసాగించి, పిల్లలకు ఒక ప్లాట్ఫారమ్ ఏర్పాటు చేసి సంపాదనను పెంచుకోవటానికి వ్యాపారం చేస్తూ, ఉద్యోగం చేస్తూ లైఫ్ని బిల్డప్ చేసుకోవాలి”. ఇది అసలు వివాహ వ్యవస్థ అభిమతం. కానీ ఇప్పుడు అదంతా లేదు. వీళ్లిద్దరు కష్టపడి భవిష్యత్తులో సంపాదించి తయారు చేయవలసినటువంటి సంపద విషయం కూడా ఇప్పుడే పెళ్లిచూపుల్లోనే పెద్దలు, పిల్లలు చూసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఈ సంపద అంతా పెళ్లి చూపులప్పుడే రెడీమేడ్గా ఉండాలి. అలా ఉంటే చేసుకుంటాం, లేకపోతే లేదు అని ముందే నిర్ణయం తీసేసుకుంటున్నారు. అబ్బాయికిగానీ, అమ్మాయికిగానీ ఉన్న విద్వత్తునుగానీ, సామర్థ్యాన్నినీ లెక్కలోకి తీసుకోవటం లేదు.

వివాహాలకు కాలాతీతమైపోయి, వయసు పెరుగుతున్నకొద్దీ, ఎలాగోలా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తమకున్న సంపద గురించి, సోషల్ స్టేటస్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నిజం తెలిసిన తర్వాత మొహమాటం లేకుండా విడా�కులు తీసుకుంటున్నారు. పెళ్లయిన తర్వాత నాతో ఉంటావా? లేక మీ తల్లిదండ్రులతో ఉంటావా? లేదా పెళ్లయిన తర్వాత మీ తల్లిదండ్రులు సపరేట్గా ఉంటారా? లేక మనతో ఉంటారా? అనే విషయమై పెళ్లికి ముందే కమిట్మెంట్ అడుగుతున్నారు. ఒకానొక కాలంలో పెళ్లయిన తరువాత కోడలు అత్తమామలను సరిగా చూసుకుంటుందా? లేదా? అని ఆలోచించేవాళ్లు.

పెళ్లయిన తర్వాత అల్లుడు తమ కూతురిని సరిగ్గా చూసుకుంటాడా? లేదా? అని ఆలోచించవాళ్లు. కాలం మారిపోయింది. ఇంకా మారుతోంది. అల్లుడు కూతురుని సరిగ్గా చూసుకోకపోయినా, కూతురు భర్తని సరిగ్గా చూసుకోకపోయినా, భార్యాభర్తల మధ్యన ఇంకే రకమైన గొడవలు వచ్చినా సరే… విడాకులు ఉన్నాయి కదా! అని ముందే ఒక ఆలోచనలో స్థిరపడి పోతున్నారు. ఇలాంటి ఆలోచనలతో వచ్చే సంబంధాలు కుదిరి, పెళ్లిళ్లు చేసుకొని, ఆ తర్వాత భార్యలు/భర్తలు కానీ పడే బాధలు వర్ణనాతీతం. ఇటువంటి బాధలు వద్దనుకుంటే వాస్తు ప్రకారం చక్కటి ‘ప్రక్రియ’ ఉంది. దీనిని పాటించి చూడండి.(Reasons For Divorce)

Read This : https://vaartha.com/category/vaastu/

Read Also : Vaasthu: మంచి సంబంధం కుదరాలంటే?

divorce rate in india Reasons For Divorce top 10 reasons for divorce in india vastu dosha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.