House For Vastu : మీరు స్వంతంగా వేసుకున్న ప్లాన్ అయినప్పటికీ వాస్తు ప్రకారం చాలావరకు బాగుంది. రోడ్డు వైపు వేసిన దుకాణాలకు, ఇంటికి మధ్య కొంత ఖాళీస్థలం వదిలేస్తే మంచిది. టాయిలెట్స్ ఇంటి మధ్యలో కాకుండా దక్షిణ, పశ్చిమ భాగాల్లో గోడలకు దగ్గరగా వేస్తే సరిపోతుంది
దక్షిణంలో వున్న ఖాళీస్థలం కంటే ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం వచ్చేలా యింటి ఉత్తర భాగాన్ని కొంతవరకు పడగొట్టి సవరించాలి. నడక తూర్పు ఈశాన్యం నుండి పశ్చిమ వాయవ్యానికి సింహద్వారాలు అమర్చాలి.
పనులు అవటం లేదు?
నైరుతిలో(Southwest) వున్న స్నానంగది, లెట్రిన్స్ కి పైన కప్పు లేకపోతే వెంటనే వేయించండి. మీ ఇంట్లో దక్షిణంలో చాలా ఖాళీస్థలం వున్నది. అలా వుండకూడదు. దక్షిణ కాంపౌండు గోడమీద నుండి ఉత్తర వాలుగా షెడ్స్ నిర్మించాలి. స్టెప్లగా పెరిగిన తూర్పు ఆగ్నేయ స్థలాన్ని వదిలేస్తూ తూర్పు కాంపౌండు గోడను సవరించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. నేల పశ్చిమ పల్లం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలా వుంటే దాన్ని తూర్పు పల్లంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది.
ఎలాంటి మార్పులు చేయాలి?
మీ ఇల్లు వాస్తు ప్రకారం చాలావరకు బాగుంది. మీకు ప్రత్యేక సమస్యలు ఏమైనా వున్నాయేమో తెలుపలేదు. అలాంటి సమస్యలేవీ లేకపోతే మార్పుల గురించి ఆలోచించకండి. ఒకవేళ ప్రత్యేక సమస్యలేమైనా వుంటే అవి ఇంటి పరిసరాల్లో వున్న వాస్తు దోషాల వల్లే అయి వుంటుంది. అప్పుడు వాటినుండి ఇంటిని రక్షించుకోవలసి ఉంటుంది.
అధిక ధనం ఖర్చవుతోంది?
మీకు పంపించిన ప్లాను ప్రకారం వున్న ఇల్లు కొన్నాను. అది నాకు కలసి వస్తుందా? ఖాళీస్థలంలో ఈశాన్యం వైపు బాత్రూమ్, లెట్రిన్ వున్నాయి. వాటిని అక్కడే వుంచాలా? మార్చాలా? బోర్/బావి ఎక్కడ వేయాలి?
జవాబు: ఈశాన్యంలో వున్న లెట్రిన్,బాత్ రూములు తొలగించి ఆ స్థలాన్ని ఓపెన్గానే వదిలేయండి. లెట్రిన్, బాత్ రూములను దక్షిణ గోడకు ఆనించి యింటికి తూర్పు గోడకు తగలకుండా నిర్మించండి. తూర్పు మధ్య భాగంలో తలుపుకెదురుగా బోర్వెల్ వేయవచ్చు. ఇలా చేస్తే ఇంటికి ఉచ్చస్థానం నడక, తూర్పు ఆగ్నేయ ఈశాన్యాల్లో ఖాళీస్థలం ఏర్పడి మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
పనిలో స్థిరత్వం ఉండటం లేదు!
మీరు ఈశాన్య భాగంలో పడుకోవటం మానేసి నైరుతి లేక వాయవ్య మూలలో పడకగది ఏర్పాటు చేసుకోవడం మంచిది. పశ్చిమ వాయవ్యానికి సింహద్వారం ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది
ఇంటి ప్లాను ఎలా ఉంది?
ఇంటి స్థల స్వరూపం అరుదైనది. ఉత్తరం ద్వారా వివరణ ఇవ్వడం వీలు కాదు. కలిసి సందేహ నివృత్తి చేసుకోవడం మంచిది.(House For Vastu)