📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hard work pays off : శ్రమకు తగిన ఫలితం రావాలంటే

Author Icon By venkatesh
Updated: July 16, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hard work pays off : మీరుంటున్నది స్వతంత్ర గృహం. స్వంత గృహం. ఇలా అనేక విధాల సమస్యలతో సతమతమవుతున్నప్పుడు స్వతంత్ర్య గృహ యజమానులు ఒక వాస్తు విషయాన్ని గ్రహించటం ప్రథమ కర్తవ్యం. స్వతంత్ర్య గృహానికున్న ప్రహరీగోడల నిర్మాణాన్ని గమనించండి. “వాస్తు నియమాల ప్రకారం పశ్చిమపు ప్రహరీగోడ తూర్పు ప్రహరీ గోడ కంటే ఎత్తుగానూ మందంగాను వుండాలి. అలాగే దక్షిణ ప్రహరీగోడ (Wall).. ఉత్తర ప్రహరీగోడ కంటే ఎత్తుగానూ మందంగానూ వుండాలి. ఏ కారణం చేతనయినా ఈ క్రమం గతి తప్పితే, మీరు పేర్కొంటున్నటువంటి వివిధ రకాల సమస్యలు కమ్ముకొచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయి”.

అందువల్ల మీ ఇంటి ప్రహరీ గోడల నిర్మాణాన్ని గమనించండి. పైన పేర్కొన్నటువంటి వాస్తు నియమం ప్రకారం లేకుండా క్రమం దప్పి వున్నట్లయితే అంటే పశ్చిమ ప్రహరీ గోడ కంటే తూర్పు ప్రహరీ గోడ ఎత్తుగానీ, మందంగానీ తక్కువ వున్నా- లేక దక్షిణ ప్రహరీ గోడ కంటే ఉత్తర ప్రహరీ గోడ ఎత్తుగానీ, మందంగానీ, తక్కువగా వున్నా వాటిని సవరించండి. వేరే తీవ్రమయిన వాస్తు దోషాలు (గృహానికి లోపల, బయటా) లేవు కనుక శీఘ్రంగా మెరుగయిన ఫలితాలు పొందవచ్చు.

మీరేగాదు.. మీలాంటి సమస్యలున్న ఎంతోమంది యిటువంటి దోషాలను సవరించుకుంటే మెరుగయిన ఫలితాలను పొందే అవకాశాలుంటాయి. ఎన్నో రకాల కుటుంబ సమస్యలు కూడా వాటికవే పరిష్కారమయ్యే వీలుంటుంది.

వ్యాపారం అభివృద్ధి చెందాలంటే?

Hard work pays off : ఎవరికయినా ఒకటి కంటే ఎక్కువ స్థిరాస్తులు వున్నప్పుడు వాటన్నిటి వాస్తు ఫలితాలు కలిపి అనుభవంలోకి వస్తూ వుంటాయి. వాస్తు బాగున్న గృహం వలన వచ్చే మంచి ఫలితాలు (+), వాస్తు బాగా లేని గృహం వలన వచ్చే చెడు ఫలితాలు(-). ఈ ప్లస్, మైనస్ లు కలిపితే వచ్చే ఫలితం మైనస్ కావచ్చు, ప్లస్ కూడా కావచ్చు. ఒకటి కంటే ఎక్కువ స్థిరాస్తులు వున్నప్పుడు ఫలితాలిలాగే వుంటాయి. కానీ అతడు ఏ ఇంటిలోనయితే నివాసం ఉంటున్నాడో.. ఆ ఇంటి వాస్తు ప్రభావం అతని మీద ఎక్కువగా ఉంటుంది. కొన్న ఫ్లాట్లు కిరాయికిచ్చి వుంటే, ఆ కిరాయిదారులు కూడా ఆ వాస్తు ప్రభావాన్ని పంచుకుంటారు. ఓపెన్ ప్లాట్లకు కాంపౌండ్ గోడలు కట్టకపోతే ఒక రకంగానూ, కడితే మరొక రకంగానూ ఆ వాస్తు మంచి – చెడు తీవ్రత ఆ యజమానులకు అనుభవంలోకి వస్తుంది. ఒకసారి వాస్తు చూపించుకొని సలహా పొందితే మంచిది.

రోడ్డుశూల మంచిదేనా?

దక్షిణ ఆగ్నేయ వీధిచూపు మంచి ఫలితాలనిస్తుంది. తూర్పు ఆగ్నేయ వీధిచూపు మంచి ఫలితాలనివ్వదు. 60 అడుగుల దక్షిణ భుజానికి ఎన్ని అడుగుల తర్వాత దక్షిణ ఆగ్నేయంలో ఎన్ని అడుగుల వీధిచూపు తగులుతున్నదో స్పష్టంగా తెలుపలేదు. ఆ కొలతలను బట్టి ఈ వీధిపోటు/చూపు కలిగిన స్థలాన్ని ఎలా సవరించుకోవాలో తెలుపవచ్చు.(Hard work pays off)

home vastu vastu vastu for income vastu tips for business growth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.