📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Family peace : కుటుంబంలో గొడవలు తగ్గాలంటే

Author Icon By Hema
Updated: September 18, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రశ్న: మా తల్లిగారు 1992లో ఇల్లు నిర్మాణం చేసారు. అప్పటి నుండి మా ఇంట్లో చాలా అశుభాలు జరిగాయి. నా ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు మరణించారు. నాకు, నా భార్యకి గొడవలు జరుగుతున్నాయి. వాస్తు దోష నివారణ తెలియచేయగలరు.

జవాబు: పూర్తి ఆగ్నేయ మూలనున్న ఒక్క గదిని (room)పూర్తిగా నిర్మూలించండి. ఈ ఒక్క పని వలన మీకు మెరుగైన ఫలితాలు శీఘ్రంగా కనిపిస్తాయి. ఈ గదికి ఉత్తరం వైపు గోడను, ఆ గదిపై స్లాబు నిర్మూలించవలసి ఉంటుంది. మెరుగైన ఫలితాలు (Results) ఉంటాయి. కానీ ఈ సవరణ చాలా సున్నితమైనది. అవసరమైతే మీ తాపీ మేస్ట్రీతో మాట్లాడించండి.

అన్నీ చెప్పినట్టే…

ప్రశ్న: మా ఫ్లాట్ వాస్తు సరిగ్గా లేదు. తూర్పున ఖాళీ స్థలం తక్కువగా ఉన్నది. పశ్చిమ దిక్కు ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా పెంపుడు జంతువులు బాగా నష్టపోతున్నాం.

జవాబు: మీ స్థలానికి ఉత్తర వాయువ్యం పెరిగి ఉన్నది. అలాగే దక్షిణ వీధిపోటు కూడా ఉన్నది. ఇటువంటి స్థలం కలిగి ఉన్నప్పుడుగానీ, ఈ స్థలంలో ఇల్లు గలవారుగానీ, నివసించేవారుగానీ, మంచి ఫలితాలను పొందే అవకాశం లేదు. ఈ స్థలాన్ని ఉత్తర ఈశాన్యం పెరిగే విధంగా మార్చవచ్చు. అలాగే చెడు ఫలితాలనిచ్చే ‘దక్షిణ…వీధిపోటును సత్ఫలితాలనిచ్చే ‘దక్షిణ ఆగ్నేయ వీధి చూపు’గా మార్పు చెందేలా స్థలాన్ని సవరించుకోవచ్చు. ఒకసారి ఫోన్ చేసి పూర్తి ప్లానుతో వ్యక్తిగతంగా వచ్చి కలవండి. మీ సందేహాలు తీరుతాయి.

త్రిభుజాకార స్థలం

ప్రశ్న: త్రికోణాకృతి గల స్థలంలో గృహ నిర్మాణం గావించకూడదని అంటారు. మాకు వున్న స్థలం త్రికోణాకృతి గల స్థలానికి తూర్పు ఈశాన్యం పెరిగి వున్నది. ఇలా ఉన్నా అందులో గృహ నిర్మాణం చేయకూడదా?

జవాబు: తూర్పు ఈశాన్యం పెరిగి వున్న స్థలమైనప్పటికీ అది త్రిభుజాకార, లేదా త్రికోణాకృతి గల స్థలమైతే, స్థలంలో గృహ నిర్మాణం గావించకూడదు. అలాంటి స్థలంలో గృహ నిర్మాణం గావించి నివాసం ఉంటున్నట్లయితే పూడ్చలేనటువంటి నష్టాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Family peace

ఇల్లు అమ్ముడు పోవాలంటే?

ప్రశ్న: ఈ స్థలం ఐదు సంవత్సరాల క్రితం కొన్నాం. పిల్లల వివాహం కోసం ఈ స్థలాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాం. కానీ కొనటానికి వచ్చినవాళ్లు తక్కువ ధరకు అడుగుతున్నారు. స్థలంచుట్టూ ఎటువంటి దోష భూయిష్ట వాతావరణం లేదు. చక్కగా ఇళ్లు కూడా దగ్గరల్లోనే ఉన్నాయి. తూర్పు రోడ్డుగల స్థలం. మేం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ స్థలం అమ్ముడు పోవాలంటే ఏం చేయాలి?

జవాబు: కొన్ని స్థలాలు అమ్ముడు పోకపోవడానికి అనేక రకాల వాస్తుదోషాలు కారణమవుతాయి. పరిసర దోషాలు, క్షేత్ర అంతర్గత దోషాలు, క్షేత్ర బహిర్గత దోషాలు, వికర్ష దోషాలు, ప్రతికూల దోషాలు మొదలైన ఎన్నో దోషాలు ఉంటాయి. ఏదో ఒక దోషం లేని స్థలంగానీ, ఇల్లుగానీ ఉండవు. ఆ దోషాలు అతిగా ఉన్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. మీరు వ్యక్తిగతంగా సంప్రదిస్తే, మీ నుండి మరికొన్ని వివరాలు తెలుసుకున్న తరువాత ఏం చేయాలో వివరిస్తాను.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/vastu-for-home-2/vaastu/544061/

FamilyPeace HappyHome PeacefulLiving Telugu News Today vastu for family vastu for home

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.