📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Demonic traps :పిశాచ స్థలాలు అంటే?

Author Icon By Hema
Updated: August 1, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Demonic traps:మనం ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు గృహానికి చుట్టుపక్కల కూడా కొంత ఖాళీ స్థలం వదలవలసి వస్తుంది. ప్రత్యేకించి పశ్చిమ, దక్షిణ దిక్కులకి కొంత ఖాళీ స్థలం తప్పకుండా
వదలాలి. అది వాస్తుశాస్త్రంలో నియమం. తక్కువలో తక్కువ పశ్చిమానికి అంటే- ఇంటికి పశ్చిమంలో ఉన్న కాంపౌండ్ వాల్కి మధ్యలో మూడు, నాలుగు అడుగులు ఖాళీ స్థలం వదలాలి.
దక్షిణంలో ఇంటికి ప్రహరీ గోడకి మధ్యలో కనీసం మూడు, నాలుగు అడుగులు ఖాళీ స్థలం వదలాలి.

ఈ విధంగా వదిలి ఇల్లు కట్టుకోవడం వల్ల ఇంట్లోకి గాలి, వెలుతురు చక్కగా ప్రసరిస్తాయి. పశ్చిమానికి ఎంత ఖాళీ స్థలం వదిలామో, అంతకు రెట్టింపు ఖాళీ స్థలం ఇంటికి తూర్పున వదలాలి.

ఇంటికి దక్షిణాన ఎంత ఖాళీ స్థలం వదిలామో, అంతకు రెట్టింపు ఖాళీ స్థలం ఇంటికి ఉత్తరానికివదిలి పెట్టాలన్నది

వాస్తుశాస్త్రంలో ఉన్న నియమం. కొంతమంది పశ్చిమానికి, దక్షిణానికి ఖాళీ స్థలాలు వదిలేయకుండా కాంపౌండ్వా ల్ మీదనే గృహ నిర్మాణం చేస్తారు.

అప్పుడు ఏమవుతుందంటే- ఆ ఇంటికి పశ్చిమానికి, దక్షిణానికి వెంటిలేటర్స్కా నీ కిటికీలు కానీ పెట్టుకోవడం కుదరదు. ఎందుకంటే అది ఇతరుల స్థలంలోకి ఓపెన్ అవుతాయి.

వాళ్లు ఆబ్జెక్ట్ చేస్తారు. వెంటిలేటర్లు, కిటికీలు పెట్టనివ్వరు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఇంటి లోపలికి గాలి, వెలుతురులను తీసుకొచ్చే వెంటిలేటర్స్, కిటికీ లేకపోవడం వలన లోపలికి ఫ్రెష్ప శ్చిమానికి దక్షిణానికిఅవుతుంది

తప్ప ‘పర్ఫెక్ట్ వెంటిలేషన్’ కాదు. పశ్చిమానికి, దక్షిణానికి గాలి సరిగ్గా సరఫరా కాదు. దీనివల్ల
ఏమవుతుందంటే పాత గాలి అక్కడ అలాగే ఉంటుంది. క్రాస్ట్ వెంటిలేషన్లో చాలా తక్కువ గాలి బయటకు పోతుంది.

కానీ పశ్చిమానికి దక్షిణానికి వెంటిలేటర్లు, కిటికీలు లేకపోవడం వలన గాలి ఆ
దిక్కుల్లో చలనం లేకుండా స్తంభించి ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే- ప్రవాహం లేని నీటిలాగా నిలిచి ఉంటుంది.

ప్రవాహం లేని నీరు ఏ విధంగా విషపూరితమో అలాగేస్తంభించిపోయి ఉన్న గాలి విషపూరితమవుతుంది. మనం పశ్చిమానికి, దక్షిణానికి సాధారణంగా బెడ్రూమ్స్, బాత్రూమ్స్ నిర్మాణం చేస్తూ ఉంటాం.

బాత్రూమ్స్ లోకి వెంటిలేటర్లు, బెడ్రూమ్స్ లోపలికి కిటికీలు లేకపోవడం వలన చెడుగాలి అంటే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ జమ అయిపోతూ ఉంటుంది. అలా దుర్గంధం కూడా తయారవుతూ ఉంటుంది. బెడ్రూమ్స్ లో రాత్రి దాదాపు 8, 10 గంటలు నిద్రపోతాం. అలా నిద్రపోతూ మనం వదిలేసే కార్బన్ డై ఆక్సైడ్అక్సైడ్ గది నిండానిండిపోతుంది. ఆ గాలి బయటికి పోవటం, కొత్త గాలి గది లోపలికి రావటం నిరోధించబడింది. కనుక కార్బన్ డై ఆక్సైడ్ రోజు రోజుకీ గాఢతరం అవుతూ ఉంటుంది. అలాగే దుర్గంధం కూడా! అందుకే రాత్రిళ్లు పడుకున్నప్పుడు ఈ కార్బన్ డై అక్సైడ్ రక్తంతో కలిసి,వల్ల

మెదడు మీద ప్రభావం చూపించడం

ఆందోళనకరమైనటువంటి కలలు రావడం, భయంకరమైన కలలు రావడం జరుగుతుంది. వీటి వల్ల ‘ప్రతిరోజూ లేదా రాత్రి రాత్రి నిద్రలో ఇలా అవుతుంది’ అనే ఒక మానసిక వేదనకు గురి కావటం తప్పనిసరి అవుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ని, ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరం పీలుస్తూ ఉండటం చేత ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ఇంకా అనేక ప్రతికూల ఫలితాలు
కలుగుతున్నాయి’ అన్న విషయం మనం గమనించం. ఇటువంటి పరిస్థితుల్లో అనారోగ్యం
కలగటం, ఆత్మవిశ్వాసం కోల్పోవటం గమనించవచ్చు. నెగిటివ్ టైప్ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. నిద్ర పోతున్నప్పుడు ఎవరో గుండెల మీద కూర్చున్నట్టు బరువు పెట్టినట్టు…
లాంటి ఫీలింగ్స్ కూడా రావచ్చు. ఇంకా తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో మంచం
మీద నుండి దొర్లి కింద పడిపోవడం, అలా ఎందుకు పడిపోయామో తెలియక ఆందోళనం చెందటం…

పిశాచ స్థలాలు అంటే?

ఇలాంటి భయాల చేత ఆ ఇంట్లో ఏదో ఉంది.. అది దయ్యమో, పిశాచమో అనుకోవటం.. ఇలా
మొదలవుతుంది. దాంతో రకరకాల వైద్యుల దగ్గరికి పోతారు. మందులు తీసుకుంటారు. ఒక్కోసారి వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ మొదలైపోతుంటాయి. అసలు కారణమేమిటంటే- పశ్చిమానికి, దక్షిణానికి వాస్తు శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఖాళీ స్థలాలు వదలకపోవటమే! ఎప్పుడైతే ఇలా ఖాళీ స్థలాలు
వదలకుండా మనం ఇంటిని నిర్మాణం చేస్తామో, అప్పుడు ఈ ఖాళీ స్థలాలు ఇంటి నిర్మాణం లోపలికి వచ్చేస్తాయి. వదలవలసిన ఖాళీ స్థలం వదలకుండా ఇంటి లోపలికి తీసుకొని, నిర్మించుకున్న ఇల్లు ‘పిశాచ స్థలాన్ని కలుపుకొని కట్టుకున్న ఇల్లు’ అవుతుంది. ఈ విధంగా ఒక వాస్తుదోషం మొదలవుతుంది. అంతేకానీ, పిశాచం అంటే మనం వ్యవహారికంగా అనుకునే
దయ్యం, పిశాచం… లాంటివి కాదండి. ఇవి ఫీలింగ్స్. అంతే! ఎప్పుడైతే వదలవలసిన ఇలాంటి ఖాళీ స్థలాలు వదలకుండా మనం ఇంటిని నిర్మాణం చేస్తామో, అప్పుడు ఈ దోషంచేత అనేక
రకాల శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటికి ఒక కారణంగా మనం ఒక విశ్లేషణలో ‘పిశాచ స్థలం’ అని చెప్పాం.

ఇంకా చెప్పాలంటే గాలి, వెలుతురులనుసరిగ్గా రానీయకుండా ఇల్లు కట్టుకున్నాం. కనుక ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అందుకని ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు, స్థలం కలిసి వస్తుంది కదా అని, ఇంకేదో అనుకొని ఇలా పూర్తి సరిహద్దుల మీద ఇల్లు కట్టుకొని కిటికీలు, వెంటిలేటర్స్లే కుండా చేసుకోవద్దు. కిటికీలు, వెంటిలేటర్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి.కావలసినంత స్థలం వదిలిపెట్టాలి. ఫ్రెష్గాలి ఇంట్లోకి వస్తూ, పోతూ ఉండటం చేత అనేక రకాల అనారోగ్య సమస్యలురాకుండా నిరోధించబడతాయి.

demonic traps home ventilation house planning vastu dosha vastu tips

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.