Alternative to Problems:ప్రశ్న: నేను ఏ పనైనా అనుకుంటే అది సకాలంలో జరగడం లేదు. అప్పులు ఎక్కువ అవుతున్నాయి.
నేను ఎవరికైనా డబ్బు అప్పుగా యిస్తే తిరిగి రావడం లేదు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఏదైనా వాస్తు దోషం ఉన్నదా?
నా సమస్య తీరే మార్గం చెప్పగలరు.
జవాబు: అనుకున్న పనులు నెరవేరకపోవటానికి, అప్పులు పెరగటానికి అనేక కారణాలుంటాయి.
వాస్తు పరమైన దోషాల వలన
ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటే వాస్తు దోషాలను సరిచేసుకోవటం వల్ల ఇబ్బందులు దూరమవుతాయి.
వాస్తు బాగా లేనప్పుడు ‘కర్మదోషాలు’
తీవ్రంగా బాధిస్తాయి. అందువల్ల వాస్తు బాగా చేసుకోలేని పరిస్థితుల్లో(అద్దె ఇల్లు నివాసమైనప్పుడు)
కర్మదోషాల తీవ్రతను తగ్గించుకునే సులభమైన మార్గాలను ఆశ్రయించటం
ఉత్తమమైన పద్ధతి. అటువంటి అనేక మార్గాల్లో ఒక సులభతరమైన మార్గం ఆచరించి చూడండి.
శనివారం ఉదయం ఏదైనా గుడికిగానీ, (temple) మరేదైనా ప్రార్థనా మందిరానికిగానీ వెళ్లండి. ఉదయం 9 నుంచి 10.30 గం॥ మధ్యన మంచిది.
దానం చేయటానికి మీకు ఇబ్బంది కలుగనంత చిల్లరను మాత్రమే తీసుకువెళ్లి అక్కడ వున్నభిక్షగాళ్లకు పంచండి.
మొత్తం చిల్లరను జేబులోగానీ, పర్సు లోగానీ డబ్బులు (money) మిగలకూడదు. అలాగే తిరిగి వచ్చేసి మీ దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. తరువాత ఆ వారం (7 రోజులు) మీకెలా గడుస్తాయో గమనించండి. మీరే ఆశ్చర్యపోతారు.
ఉత్తర ముఖం స్థలాలే కొనాలా?
ప్రశ్న: మేం ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి స్థలంకొనాలని అనుకుంటున్నాం. కానీ పడమర, దక్షిణ ముఖాలువున్న స్థలాలే దొరుకుతున్నాయి.
తూర్పు, ఉత్తర ముఖం స్థలాలే కొనాలా? లేక ఏదయినా పరవాలేదా? అలాగే మా ఇద్దరిలో ఎవరి పేరు మీద స్థలం కొంటే యోగిస్తుందో తెలియజేయగలరు.
జవాబు: వ్యవహార నామ రీత్యామీ ఇద్దరికీ ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్య ముఖద్వారం
వున్న ఇళ్లు చక్కగాయోగిస్తాయి.
ఖాళీ స్థలం కొంటే ఉత్తరంలో వీధి ఉన్న ఖాళీ స్థలం కొనండి. ఒకవేళ ఫ్లాట్కొ నాలనుకుంటేఉత్తర ముఖద్వారం లేదా ఉత్తర
ఈశాన్య ముఖద్వారం ఉన్న ప్లాట్కొనండి. ఆ కాంప్లెక్స్కి వీధి ఏ దిక్కులో వున్నా ఫరవాలేదు.
వాస్తు దోషాలున్నాయా?
ప్రశ్న: నేను ఏదయినా పని చేయాలనుకుంటే అది పూర్తి కావడం లేదు. రోజు రోజుకీ అప్పులు పెరిగిపోతున్నాయి.
నేను ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినా నాకు తిరిగి రావడం లేదు. వాస్తు సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం నేను ఉత్తర ముఖం ఉన్న బాడుగ ఇంట్లో ఉంటున్నాన
జవాబు: మీ వ్యవహార నామ రీత్యా మీకు దక్షిణ సింహద్వారం గృహం చక్కగా యోగిస్తుంది.
అందుకు వ్యతిరేక దిశలో ఉన్న ఉత్తర ద్వార గృహంలో మీరు ఉంటున్నారు.
కాబట్టి కూడా మీకు అనేక రకాల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశముంది. ఒకసారి మీరు దక్షిణ ద్వారమున్న (వాస్తు సాధారణ నియమాలకు తగ్గట్టుగా ఉండాలి) గృహంలోకి మారి చూడండి. మెరుగైన ఫలితాలు తప్పనిసరిగా పొందుతారు.
Read also:hindi.vaartha.com
Read also: