అమెరికా తూర్పు మధ్య ప్రాంతాలు తీవ్ర తుపానులతో వణికిపోయాయి. ఈ బీభత్సం కారణంగా ఇప్పటివరకు కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.టెనెస్సీ రాష్ట్రంలో తుపానులు తీవ్రంగా దాటికి వచ్చాయి. ఒక్క ఈ రాష్ట్రంలోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.కెంటకీ రాష్ట్రంలోని జెఫెర్సన్‌టౌన్ ప్రాంతంలో టోర్నడో దాడి చేసిందని నివేదికలు చెబుతున్నాయి. కొన్ని భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది.వాతావరణ శాఖ భారీ వర్షాలు, ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.PowerOutage.us సమాచారం ప్రకారం, ఐదు రాష్ట్రాల్లో విద్యుత్ కట్ అయింది.

దాదాపు 1,40,000 మందికి విద్యుత్ సేవలు అందడం లేదు.సామాజిక మాధ్యమాల్లో షేర్ అయిన ఫోటోల ప్రకారం, అనేక ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. చెట్లు నేలకూలాయి, విద్యుత్ తీగలు తెగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లు కూడా బోల్తా పడ్డాయి.వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. వాతావరణంలో స్థిరత్వం లేదని, దీని వల్ల తుపానులు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు.గత ఏడాది కూడా అమెరికాలో ఇదే తరహాలో విపత్తులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో టోర్నడోలు, హరికేన్‌లు దేశాన్ని అతలాకుతలం చేశాయి. అధిక ఉష్ణోగ్రతలు ఆ సమయంలో నమోదయ్యాయి.ఈ తరహా వాతావరణ మార్పులు భవిష్యత్తులో ఇంకా తీవ్రతరంగా మారే అవకాశం ఉంది. ప్రజలు, పాలకులు అందరూ ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలి.
Read Also : Donald Trump: బైడెన్ పాలనలో పెరిగిన అమెరికా వాణిజ్య లోటు: ట్రంప్