రైలు వేళల్లో మార్పులు
గుంతకల్లు రైల్వే : రాయలసీమ జిల్లాల మీదుగా కాచిగూడ-గుంతకల్లు(Kacheguda), కర్నూలు- డోన్-నంద్యాల మధ్య తిరిగే పాసింజర్ రైలు సర్వీసుల వేళలను(Train Timings) నేటి (శనివారం) నుంచి మార్పులు చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
Read also: Guntur BC Hostel: బిసి హాస్టల్లో కలుషిత నీరు తాగిన విద్యార్థులు
కాచిగూడ నుంచి గుంతకల్లు వెళ్ళే 57412 పాసింజర్ రైలు(Train Timings) శనివారం నుంచి ప్రతి రోజూ ఉదయం 11.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, మహబూబ్ నగర్ మధ్యాహ్నం 02.06/08, గద్వాల 03.45/47, కర్నూలు సాయంత్రం 05.00/02, డోన్ 06.25/30, గుంతకల్లుకు రాత్రి 09.05 గంటలకు చేరుకుంటుంది. అలాగే కర్నూలు నుంచి నంద్యాల వెళ్ళే 77209 పాసింజర్ రైలు శనివారం నుంచి ప్రతి రోజూ సాయంత్రం 05.20 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి డోన్ 06.40/50, నంద్యాలకు రాత్రి 0925 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్ళకు మార్గమధ్యంలో ఉన్న స్టేషన్లలో సైతం మార్పులు చేసినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: