हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

TMC MP Mahua Moitra: పెళ్లి చేసుకున్న పొలిటికల్ ఫైర్ బ్రాండ్

Sudheer
TMC MP Mahua Moitra: పెళ్లి చేసుకున్న పొలిటికల్ ఫైర్ బ్రాండ్

రాజకీయ రంగంలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Trinamool MP Mahua Moitra ) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె జీవిత భాగస్వామిగా ఒడిశాకు చెందిన బీజేడీ మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయనాయకుడు పినాకి మిశ్రా(Pinaki Misra)ను ఎన్నుకున్నారు. రాజకీయాల్లోను , వ్యక్తిగత జీవితంలోనూ తన నిర్ణయాల్లో స్పష్టత చూపిన మహువా ఈసారి కూడా సైలెంట్‌గా పెళ్లి చేసుకోవడం గమనార్హం.

ప్రైవేట్‌గా వివాహం

మే 30న జర్మనీలో వారు ఎంతో ప్రైవేట్‌గా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక సింపుల్‌గా జరిగినట్టు సమాచారం. మహువా వయసు ప్రస్తుతం 50 ఏళ్లు కాగా, పినాకి మిశ్రాకు 65 ఏళ్లు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. గతంలో విడాకులు పొందిన తరువాత, ఇద్దరూ సహజీవనం కాకుండా నూతన జీవితానికి పెళ్లి బంధంతో శ్రీకారం చుట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియా లో పెళ్లి ఫోటోలు వైరల్

ఇవాళ వారి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు మహువా మొయిత్రా , పినాకి మిశ్రా ఈ పెళ్లిని అధికారికంగా ప్రకటించలేదు. ఫొటోల్లో ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తూ, నవదంపతులుగా ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులే కాదు, వారి అభిమానులు కూడా ఈ వార్తను ఆశ్చర్యంతో స్వాగతిస్తున్నారు.

Read Also : RCB:ఆ ట్వీటే తొక్కిసలాటకు కారణమైందా ? కేసీఏకు ఉచ్చు..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870