కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన సరదా జోక్ ఆయనకే శాపంగా మారింది. భద్రతా సిబ్బందితో సరదాగా మాట్లాడాలనుకున్న అతడు చివరకు పోలీస్ స్టేషన్ వెళ్లి లాకప్ లో కూర్చోవాల్సి వచ్చింది. విమానం ఎక్కి విదేశాలకు వెళ్లాల్సిన వ్యక్తి పోలీస్ వాహనంలో స్టేషన్ కు వెళ్లడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఏం జరిగింది?
బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కోజికోడ్‌కు చెందిన రషీద్ అనే వ్యక్తి మలేషియాలోని కౌలాలంపూర్ వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం అతడు రాత్రి 11:30 గంటల సమయంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. ఎప్పటిలాగే, లగేజీ ను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే, అతని బ్యాగు ఎక్కువ బరువుగా ఉందని గమనించిన అధికారులు.ఈ బ్యాగులో ఏముంది? అని ప్రశ్నించారు.దీనికి రషీద్ సరదాగా లోపల బాంబ్ ఉంది అని చెప్పాడు. తాను సరదాగా అన్నానని రషీద్ భావించినా. భద్రతా సిబ్బంది మాత్రం అతని మాటలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే లగేజీని పూర్తిగా తనిఖీ చేయగా, అనుమానాస్పద వస్తువులేమీ కనిపించలేదు. అయినప్పటికీ, ఆయన వ్యాఖ్యలు అత్యంత సున్నితమైనవిగా భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విమానాన్ని వదిలిపెట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తారని రషీద్ ఊహించనేలేదు. భద్రతా అధికారుల సమాచారం మేరకు కొచ్చిన్ పోలీస్ టీమ్ అక్కడికి చేరుకుని రషీద్‌ను అదుపులోకి తీసుకుంది.
విమానాశ్రయాల్లో ఇలాంటి జోకులు ప్రమాదమే
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విమానాశ్రయాల భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటోంది. ప్రయాణికులు చిన్న తప్పిదం చేసినా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. విమానాశ్రయాల్లో బాంబ్, టెర్రరిస్టు వంటి పదాలను వినిపించడం కూడా చట్టపరంగా చర్యగా మారొచ్చు.భద్రతా సిబ్బందికి సరదాగా కనిపించే మాటలు, వారికైతే నిబంధనల ఉల్లంఘనగా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలి. ఒక చిన్న జోక్ వల్ల విమాన ప్రయాణం నిలిచిపోవడమే కాకుండా, పోలీస్ స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. విమానాశ్రయాల్లో సరదా జోకులు ప్రమాదమే!భద్రతా సిబ్బందిని గౌరవంగా ఎదుర్కొనాలి.బాంబ్, టెర్రరిస్టు వంటి పదాలను అసలు ఉపయోగించకూడదు.ప్రత్యక్ష నిర్బంధానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఎవరైనా విమానాశ్రయాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడి, జోక్ చేద్దామనుకుంటే జైలుకు వెళ్లే పరిస్థితి రావొచ్చు!విమాన ప్రయాణం చేసేవారికి ఎప్పుడూ కొన్ని నియమాలు, భద్రతా పరమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. విమానాశ్రయ భద్రతా సిబ్బంది అత్యంత కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తారు. ప్రయాణికులు కూడా ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కానీ, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల క్షణాల్లో పరిస్థితి మారిపోతుంది. ఈ ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.