lbnagar wall collapse

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.

ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగాపైనుంచి మట్టిదిబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కూలీని మట్టిదిబ్బల నుంచి బయటకు తీసి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. మట్టి దిబ్బల నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీయగా.. మరో ఇద్దరి డెడ్ బాడీలను బయటకు తీసేందుకు ఫైర్, పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు కూలీలు బిహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.

Advertisements
10504 5 2 2025 12 40 6 1 DSC5687

ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ,
డి ఆర్ డిఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. సెల్లార్ కోసం తీసిన గుంతలు
లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణంకోసం తీసిన గుంతలో పిల్లర్లు నిర్మించి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది . ఫైల్స్ లో కాంక్రెట్ నింపుతుండగాఫై నుంచి మట్టి జారి పడిపోవడంతో కార్మికులు దానికిందచిక్కుకుపోయారు.భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి .క్షత్రగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు . భవన నిర్మాణ పనుల కోసం సూర్యాపేట, బీహార్ నుంచి వచ్చిన కార్మికులువిధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది .ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Related Posts
BJP MLC: కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు Read more

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Srisailam corridor

హైదరాబాద్-శ్రీశైలం రహదారి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ప్రయాణ సమయం Read more

దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
cricketer Syed Abid Ali

హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) అమెరికాలో కన్నుమూశారు. 1967 నుండి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, Read more

కేటీఆర్‌కు షాక్..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Shock for KTR.. High Court dismisses quash petition

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను Read more

Advertisements
×