Tourism Officer: ఆఫీస్‌ను ఓయో గదిగా మార్చుకున్న ఉద్యోగి..ఎక్కడంటే?

Read Time:  1 min
Tourism Officer: ఆఫీస్‌ను ఓయో గదిగా మార్చుకున్న ఉద్యోగి..ఎక్కడంటే?
FONT SIZE
GET APP

విజయవాడ నగరంలోని టూరిజం డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, పనివేళలు పూర్తయ్యాక ఆఫీసుకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత సదరు ఉద్యోగి తిరిగి ఆఫీసుకు వచ్చాడు. తన వద్ద ఉన్న తాళం చెవులతో ఆఫీసులోకి ప్రవేశించాడు. పెండింగ్ పని పూర్తిచేయడానికి వచ్చాడేమో అనుకుంటే పొరపాటే ఎందుకంటే , ఓ మహిళను తన వెంట తీసుకెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. ఇద్దరూ లోపలికి వెళ్లి కొద్ది సమయం తర్వాత తిరిగి బయటకు వచ్చారు. ఆపై ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయాడు.

సీసీటీవీలో

టూరిజం డివిజనల్ ఆఫీసులో కీలక ఉద్యోగి కావడంతో తనను అడిగే వారు లేరనే ధైర్యమో లేక మరేమిటో కానీ మహిళతో దర్జాగా తన ఇంట్లోకి వెళ్లినట్లు ఆఫీసు తాళం తెరిచి లోపలికి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సదరు డిపార్టుమెంట్‌లో కలకలం రేపింది. కార్యాలయం ప్రవేశ ద్వారంలో, లోపలా అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో సదరు ఉద్యోగి నిర్వాకం రికార్డైంది. దీనిపై విచారణకు ఆదేశించామని, నివేదిక అందగానే సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వివరించారు. అయితే సదరు ఉద్యోగి చేసిన పని ఇప్పుడు ఆ శాఖలో కలకలం రేపింది. సదరు ఉద్యోగి ఒక్కరేనా ఇంకా ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై టూరిజం శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ, “సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణకు ఆదేశించాం. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి దుర్వినియోగం జరగనీయము” అని తెలిపారు. అంతేకాక, కార్యాలయాల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేసే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Read also: Boma Akhila Priya: నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: భూమా అఖిలప్రియ

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.