📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Madhya Pradesh: పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

Author Icon By Vanipushpa
Updated: February 19, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పరిహారం చెల్లించాకే రోడ్డు పనులు చేసుకోవాలన్న ఇద్దరు మహిళలను కాంట్రాక్టర్ గుండాలు సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని రేవా జిల్లా, హినౌతా గ్రామంలో 2024లో జరగిన ఈ ఘటన వీడయో.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరిహారం ఇవ్వకుండా ఇద్దరు మహిళల భూమిని ఓ రోడ్డు కాంట్రాక్టర్ స్వాధీనం చేసుకుని పనులు కొనసాగిస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తులైన బాధిత మహిళలు తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలంటూ కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా మహిళల నిరసనకు దిగారు. పనులను అడ్డుకున్నారు. దీంతో ‘నన్నే అడ్డగిస్తారా’ అంటూ రెచ్చిపోయిన కాంట్రాక్టర్ తన కిరాయి గూండాలతో సజీవంగా ఇ ఇద్దరి మహిళలను పూడ్చేందుకు ప్రయత్నించాడు.

Read Also: BC Victory Telangana : బీసీల సంచలన విజయం, మున్సిపల్ ఫలితాల్లో కొత్త సందేశం

రాజకీయాల్లో సంచలనం రేపిన ఘటన

జేసీబీతో గొయ్యి తవ్వి వారిని సజీవంగా పూడ్చే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సాటి గ్రామస్తులు వెంటనే వెంటనే రంగంలోకి దిగి గూండాల్ని అడ్డగించి ఇద్దరు మహిళలను కాపాడారు. ఓ మహిళను నడుము వరకు, మరో మహిళను మెడ వరకు పూడ్చిపెట్టగా..వారిని గ్రామస్థులు వెంటనే మట్టిని త్రవ్వేసి కాపాడారు. అప్పట్లో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్డు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఘటన రాజకీయంగా ప్రతికూలతను తెచ్చిపెట్టింది. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సీరియస్ తీసుకుని చర్యలకు ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

criminal assault case rural violence India shocking crime incident Telugu News Paper Telugu News Today women attacked over compensation demand women buried alive case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.