📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Venuzuela: ట్రంప్‌నకు మచాడో నోబెల్ బహుమతిని ఇవ్వబోతున్నారా?

Author Icon By Vanipushpa
Updated: January 10, 2026 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి పురస్కారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకునేందుకు తనకంటే గొప్ప అర్హుడు ఈ ప్రపంచ చరిత్రలోనే ఎవరూ లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో చమురు, సహజవాయువు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూనే.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు.

బరాక్ ఒబామాకు నోబెల్ బహుమతిపై ట్రంప్ తన అసంతృప్తి

గతంలో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడంపై ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ఒబామా ఏమీ చేయకపోయినా ఆయనకు ఆ గౌరవం దక్కింది. కానీ నా దృష్టి ఎప్పుడూ ప్రాణాలు కాపాడటం పైనే ఉంటుంది. యుద్ధాలను ఆపడం ద్వారా నేను కోట్లాది మంది ప్రాణాలను రక్షించాను. శాంతిని నెలకొల్పడంలో నా పాత్ర ఎంతో కీలకం” అని ట్రంప్ స్పష్టం చేశారు. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో(Machado) వచ్చే వారం వాషింగ్టన్‌కు రానున్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఈ చర్చ మరింత వేడెక్కింది. గత ఏడాది నార్వేలోని నోబెల్ కమిటీ ఆమెకు నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేసింది. అయితే ఇటీవల ఆమె ఒక సంచలన ప్రకటన చేస్తూ.. తనకు వచ్చిన ఈ ప్రతిష్టాత్మక అవార్డును డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: Chinese Manja Ban: చైనా మాంజా వాడితే కఠిన చర్యలు

Venuzuela: ట్రంప్‌నకు మచాడో నోబెల్ బహుమతిని ఇవ్వబోతున్నారా?

నార్వే సరిదిద్దుకోవాల్సిందే!

మచాడో పర్యటన గురించి ట్రంప్ మాట్లాడుతూ.. “ఆమె మన దేశానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వస్తున్నారు. నేను ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి.. ఆ కృతజ్ఞతలు నాకే దక్కుతాయి. జరిగిన పొరపాటుకు నార్వే చాలా ఇబ్బంది పడుతోంది. దానిని సరిదిద్దేందుకే ఆమె ఇక్కడికి వస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. అంటే తనకు రావాల్సిన అవార్డు ఆమెకు వచ్చిందని, ఇప్పుడు దానిని ఆమె తిరిగి ఇచ్చేస్తారనే సంకేతాలను ట్రంప్ ఇచ్చారు.
వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మచాడోకు ట్రంప్ ఇస్తున్న మద్దతు, దానికి బదులుగా ఆమె నోబెల్ బహుమతిని ఆయనకు అంకితం చేయడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా మారబోతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump Nobel Peace Prize Global Politics Debate Machado Nobel Proposal Nobel Peace Prize News Telugu News online Telugu News Today Trump International Politics Trump Nobel Controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.