📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Wildlife : వన్యప్రాణులను కాపాడుకోలేమా?

Author Icon By Sudha
Updated: February 23, 2026 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అటవీ రక్షణకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చి స్తున్నా అడవులను ధ్వంసం చేసేవారిని ఉక్కు పాదంతో అణచివేస్తామని అటు కేంద్రపాలకులు, ఇటు ఆయా రాష్ట్రాల పాలకులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లభించడం లేదు. అంత కంతకు అటవీ విధ్వంసం పెరిగిపోతున్నది. కొందరు అధి కారులు అవినీతి, నిర్లక్ష్యం, వీటన్నింటికి మించి రాజకీయ జోక్యంతో చట్టాలు నిరుపయోగం అవుతున్నాయి. అరణ్యాలను స్మగర్లకు వదిలి కొందరు అధికారులు జనార ణ్యాలకే పరిమితం కావడంతో పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్నది. ఒకనాడు దేశంలో కాకులు దూరని కీకారణ్యాలుగా పేరొందిన అరణ్యాలు సైతం మైదానాలు గా మారిపోతున్నాయి. ఈ అటవీ సంపదతోపాటు వీటి ఆధారంగా శతాబ్దాల తరబడి జీవనం సాగిస్తున్న పెద్ద పులులు, చిరుత పులులు, చుప్పులు, అడవి పందులు, ఏనుగులు, ఇలా ఒక్కటేమిటి సమస్త ప్రాణులు వేటగాళ్ల బారినుంచి తప్పించుకోలేక కాలగర్భంలో కలిసిపోతున్నా యి. అడవుల విస్తీర్ణం తగ్గడం, స్మగ్లర్ల కార్యకలాపాలు పెరగడంతో ఈ వన్యప్రాణులకు అటవీ ప్రాంతాల్లో ఆహారం దొరకక జనారణ్యాలపై పడుతున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు, అడవిపందులు తదితర వన్యప్రాణులు (Wildlife) ఎన్నో జనారణ్యంలోకి చొచ్చుకువచ్చి ఆహారం కోసం రైతులు పంటలపై పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాయలసీమలోని చిత్తూరు ప్రాంతంలో అడవి ఏనుగులు పంటలపై దాడిచేస్తున్నా యి. దీంతో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సాగు చేసు కున్న పంటలు నోటికి అందుతున్న దశలో వన్యప్రాణులు ధ్వంసం చేస్తుండటంతో పురుగు మందులు, కరెంటు తీగలు పెట్టి కొందరు చంపుతున్నారు. ఇది రాను రాను పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం. ఒకనాడు ఆహారం కోసం ఆ తర్వాత సరదాగా ఆరంభమైన వన్య ప్రాణుల వేట ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది.

Read Also : http://Tejas Jet Crash: తేజస్ జెట్ ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం

Wildlife

ఆదిమానవుని జీవనం వేటతోనే ఆరంభమైనట్లు చరిత్ర చెబుతున్నది. కేవలం తమ ఆకలి తీర్చుకునేందుకే ఆనాటి ఆదిమానవుడు వేటాడేవారని చరిత్ర ఆధారాలు వెల్లడిస్తున్నాయి. రాజుల కాలంలో వేటను సరదాగానో, తమ ప్రతిష్టకోసం కొనసాగించారు. ఆ తర్వాత వేట క్రమేపీ వ్యాపారంగా రూపాంతరం చెందడంతో 1526 నుండి 1857 వరకు వేటజోరుగా సాగినట్లు ఆధారాలు న్నాయి. మనదేశానికి బ్రిటిష్ కాలంలో తుపాకులు రావ డంతో వేట మరింత సులభం అయింది. దీంతో వన్య ప్రాణులతోపాటు ప్రధానంగా పులుల సంఖ్య విపరీతంగా పడిపోయింది. స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో నలభై వేలకుపైగా పులులు ఉండగా, 1972 ప్రాంతానికి మూడువేల వరకు తగ్గిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలు పులుల జాతితోపాటు మరికొన్ని వన్య ప్రాణుల జాతి కూడా ఆనవాళ్లు లేకుండా అంతరించిపో తుందని ఆందోళనలు వ్యక్తం కావడంతో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని 1972 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. వేటాడటం నిషేధించడం తోపాటు పులుల పెంపుదలకు కొన్ని ప్రత్యేక పథకాలు చేపట్టారు. అందులోభాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో ఇరవైమూడు టైగర్ ప్రాజకులను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంవల్ల ఒక ప్రాజెక్టు ప్రారంభ మైంది. అయినా ఆశించిన మేరకు పెద్దపులుల సంఖ్య పెరగడం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా అడవుల్లో వేట కారణంగా జింకలు, కుందేళ్లు లాంటి వన్యప్రాణుల (Wildlife) సంఖ్య తగ్గిపోవడంతో పులులు ఆహారం దొరకక జనారణ్యంలోకి ప్ర వేశిస్తున్నాయి.

Wildlife

రైతుల పశువులు, గొర్రెలు, మేకలు లాంటి వాటిపై దాడి చేసి చంపుతున్నాయి. దాదాపు ఏడువందల కిలోమీటర్లకుపైగా ప్రయాణించి పెద్దపులి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చేరుకున్నది. ఆహారం దొర కక పశువులపై దాడి చేస్తున్న దానిని పట్టుకునేందుకు పెద్దఎత్తునే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు అది ఒక ఇంట్లోకి దూరడంతో మత్తుతూటతో పట్టుకొని ముందు జూకు తరలించి ఆతర్వాత అభయారణ్యాలకు పంపారు. ప్రస్తుతం సిద్ధిపేట జనగాం జిల్లాలో మరొక పెద్దపులి తిరుగుతున్నది. దాన్ని పట్టుకునేందుకు గత నెల రోజులు గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆ పాంతవాసులుకు ఈ పులివల్ల ఇబ్బందులు, భయాందోళనలు కలుగుతున్న మాట వాస్తవమేకావొచ్చు. అసలు ఆ పులి ఎందుకు అరణ్యాలను వదిలి వస్తున్నదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అడవులు అంతరించ డం, జనసంచారం పెరిగిపోవడం, జంతువుల సంఖ్య తగ్గిపోతుండడంతో ఆ ప్రభావం పులితోపాటు అన్ని వన్య ప్రాణులపై పడుతున్నది. ఇప్పుడు వేటకు తుపాకులు కూడా అవసరం లేకుండాపోయింది. మేకనో, గొర్రెనో ఏదో పశువునో ఎరగావేసి దానికి క్రిమిసంహారక మందు లు ప్యాకెట్లు కట్టి పులులను మట్టుపెడుతున్నారు. ఒకపక్క అడువులు తగ్గిపోవడం, మరొకపక్క విజృంభించిన విష ప్రయోగాలు, విద్యుత్కం చెల ఉచ్చులతో వన్యప్రాణులు బలైపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి. అవసరం అనుకుంటే చట్టాన్ని సవరించి మరింత కట్టు దిట్టంగా అమలు చేయాలి. అడవులను పర్యవేక్షించాల్సిన అధికారుల కార్యాలయాలు, పరిధులు నగరాలకే పరిమి తం చేయకుండా ఆయా ప్రాంతాలకు తరలించాలి.
వన్యప్రాణులను కాపాడేందుకు త్రికరణశుద్ధిగా అన్ని స్థాయిల్లోనూ ప్రయత్నాలు జరగాలి. ఇందులో స్వచ్చంధ సంస్థలు కూడా పాలుపంచుకోవాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper :epaper.vaartha.com

Read Also:

biodiversity Breaking News latest news nature protection Telugu News Wild animals Wildlife Wildlife conservation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.