పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల తర్వాత ప్రపంచమంతా ఉలిక్కిపడింది. అయితే ప్రపంచ దేశాలు ఈ దాడులపై రియాక్ట్ అవుతుంటే చైనా(China) మాత్రం సంయమనాన్ని పాటిస్తోంది. దాడులను ఖండిస్తూ కాల్పుల విరమణ పిలుపునిస్తోంది. దీని వెనుక అనేక ప్రధాన కారణాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరా చైనాకు చాలా అవసరం. అది లేకుంటే చైనాలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం ఉంది. యుద్ధ వాతావరణంలో చైనా-ఇరాన్ మధ్య ఉన్న లోతైన ఇంధన సంబంధాలు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన చమురు సరఫరా మార్గాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అందుకే ఈ సంక్షోభం బీజింగ్‌కు దూరమైనది కాకుండా..ప్రత్యక్ష ఆర్థిక ప్రభావాలను కలిగించే అంశంగా మారింది. ఈ పరిస్థితుల మధ్య బీజింగ్ అధికారికంగా ఈ దాడులను ఖండిస్తూ, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.
Read Also: Israel Lebanon War: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి?
ఇజ్రాయెల్ చేపట్టిన “రోరింగ్ లయన్”
అయితే, ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తూ ఇంధన ప్రవాహాలను ప్రమాదంలో పడేసే ఆర్థిక లేదా రాజకీయ ప్రతీకార చర్యలకు మాత్రం చైనా దూరంగా ఉంది. ఈ నిశ్శబ్దం వెనుక గల వ్యూహాత్మక లెక్కలే ఇప్పుడు విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిబ్రవరి 28న తెల్లవారుజామునకు ముందు.. అమెరికా – ఇజ్రాయెల్ కలిసి టెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్ ప్రాంతాల్లోని ఇరానియన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, కీలక నాయకత్వ స్థావరాలపై సమన్వయ దాడులు చేపట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్‌ను “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”గా పేర్కొంటూ.. దీన్ని నిర్ణయాత్మక దెబ్బగా అభివర్ణించారు. అణు చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ చేపట్టిన “రోరింగ్ లయన్” ఆపరేషన్, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలను, సీనియర్ కమాండ్ వ్యవస్థను బలహీనపరచడంపై దృష్టి సారించింది. .
గల్ఫ్ అరబ్ దేశాల్లోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా..
ఈ సంక్షోభం చైనాకు అత్యంత సున్నితమైన అంశంగా మారడానికి కారణం ఇంధన ఆధారిత వాస్తవాలు. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 80 శాతానికి పైగా చైనా కొనుగోలు చేస్తోంది. 2025 నాటికి ఇది రోజుకు సుమారు 1.38 మిలియన్ బ్యారెళ్లకు చేరింది. ఇది చైనా మొత్తం సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 13 నుంచి 14 శాతం వరకు ఉంటుంది. అయితే China ప్రధాన సరఫరాదారులు రష్యా, సౌదీ అరేబియానే. సంక్షోభం పెరిగిన తర్వాత, చైనా రిఫైనరీలు నిశ్శబ్దంగా ఇరానియన్ కొనుగోళ్లను తగ్గించి, తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ చమురుపై ఆధారాన్ని పెంచుకున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: