हिन्दी | Epaper

Trump: భారత్​పై 25 శాతం అదనపు సుంకం రద్దు..వైట్​ హౌస్

Vanipushpa
Trump: భారత్​పై 25 శాతం అదనపు సుంకం రద్దు..వైట్​ హౌస్

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై విధించిన అదనపు 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) రద్దు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. 2025 ఆగస్టులో రష్యా నుంచి భారత్​ చమురు దిగుమతి చేసుకోవడాన్ని కారణంగా చూపుతూ అమెరికా 25 శాతం అదనపు సుంకాన్ని విధించింది. ‘భారత్ పలు నిబంధనలను అంగీకరించిట్లు వైట్​ హౌస్ తెలిపింది. ‘భారత్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా చమురు దిగుమతులను నిలిపివేస్తామని అంగీకరించింది. అలాగే అమెరికా ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. తదుపరి 10 సంవత్సరాల పాటు రక్షణ సహకారం విస్తరణకు ఫ్రేమ్‌వర్క్​లో ప్రవేశించింది. ఈ చర్యల వల్ల భారత్ అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక ప్రయోజనాలతో తగినంతగా అనుసంధానమైంది. ఉన్నతాధికారుల సిఫారుసులు, తాజా పరిణామాల సమీక్ష అనంతరం ఈ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని ట్రంప్ నిర్ణయించారు’ అని వైట్​ హౌస్ వెల్లడించింది.

Read Also: America:”వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్” లిస్టులో 89 మంది భారతీయులు

Trump: భారత్​పై 25 శాతం అదనపు సుంకం రద్దు..వైట్​ హౌస్
Trump: భారత్​పై 25 శాతం అదనపు సుంకం రద్దు..వైట్​ హౌస్

భారత్​ను అమెరికా పర్యవేక్షిస్తూనే ఉంటుంది

ఫిబ్రవరి 7, 2026 ఉదయం 12:01 నుంచి భారత్‌పై విధించిన 25శాతం అదనపు సుంకం తొలగిస్తున్నట్లు వైట్​హౌస్ ఉత్తర్వులు జారీ చేసింది. హార్మోనైజ్డ్ టారిఫ్ షెడ్యూల్ కింద సంబంధిత సుంకాల నిబంధనలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే వసూలు చేసిన సుంకాలను అమెరికా కస్టమ్స్ నిబంధనల ప్రకారం తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేయడానికి అమెరికా విదేశాంగ మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి తదితరులకు అధికారాలు ఇచ్చారు. రష్యా చమురు దిగుమతికి సంబంధించి సమ్మతి విషయంలో భారత్​ను అమెరికా పర్యవేక్షిస్తూనే ఉంటుందని వైట్ హౌస్ తెలిపింది. భారత్ మళ్లీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యా చమురు కొనుగోళ్లకు వెళ్లితే, ఈ అదనపు సుంకాన్ని తిరిగి విధించే అవకాశం ఉందని వైట్​హౌస్ స్పష్టం చేసింది.ఇదిలా భారత్​- అమెరికా మధ్యంతర ఒప్పందంపై యూఎస్ మాజీ వాణిజ్య సహాయ కార్యదర్శి రేమండ్ విక్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ తన అన్ని దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించేందుకు అంగీకరించలేనది పేర్కొన్నారు. ఇది ఇరు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో స్పష్టం అవుతోందని తెలిపారు. ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870