📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Supreme Court: యూజీసీ కొత్త నిబంధనలు ఏంటి?

Author Icon By Vanipushpa
Updated: January 29, 2026 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) (UGC) తీసుకువచ్చిన ‘ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్- 2026’ ఇప్పుడు దేశంలో పెను చర్చకు దారితీసింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం ఈ రూల్స్ తీసుకువచ్చామని చెబుతుండగా.. మరోవైపు జనరల్ కేటగిరీ విద్యార్థులు మాత్రం వీటిని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ నిబంధనల అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు రావాలని KCRకు SIT నోటీసులు

Supreme Court: యూజీసీ కొత్త నిబంధనలు ఏంటి?

యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపడమే వీటి ప్రధాన ఉద్దేశాలు

జనవరి 13వ తేదీన యూజీసీ ప్రకటించిన ఈ నిబంధనలు దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు వర్తిస్తాయి. యూనివర్సిటీల్లో కుల వివక్షను రూపుమాపడమే వీటి ప్రధాన ఉద్దేశాలు అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ కుల వివక్షను అడ్డుకునేందుకు.. ఎస్సీ, ఎస్టీలతోపాటు.. ఈసారి జాబితాలో కొత్తగా ఓబీసీ విద్యార్థులను చేర్చారు. ఈ వర్గాలపై జరిగే వివక్షను అరికట్టడం కోసం వీటిని తెచ్చారు. ప్రతి కాలేజీ లేదా యూనివర్సిటీలో ‘ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ (ఈఓసీ)’.. ఈక్విటీ కమిటీలు, ఈక్విటీ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏదైనా వివక్షపై ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు కమిటీ సమావేశం కావాలి. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. 7 రోజుల్లో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల కోసం 24/7 హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలి. ఈ యూజీసీ తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై దాఖలైన పలు పిటిషన్లను విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

academic policy changes college and university rules higher education reforms India Telugu News online UGC new rules UGC regulations update University Grants Commission guidelines

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.