📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

West Asia War: పశ్చిమాసియాలో యుద్ధం.. LPG గ్యాస్ కొరత..రైతులకు నష్టం

Author Icon By Vanipushpa
Updated: March 6, 2026 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారత్‌ (India) కు సవాలుగా మారింది. ఇప్పటి వరకు ప్రవాసీయులకే పరిమితమైన ఈ ప్రభావం, ఇప్పుడు నేరుగా భారతీయ రైతుల పంట పొలాలకు, సామాన్యుల వంటగదులకు విస్తరిస్తోంది. ప్రధానంగా ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఎరువుల కొరత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో యూరియా ఉత్పత్తి చేసే 32 ప్లాంట్లలో దాదాపు 30 ప్లాంట్లు ఖతర్ నుంచి దిగుమతి అయ్యే నాఫ్తాపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, యుద్ధం కారణంగా నాఫ్తాను సరఫరా చేయలేమని ఖతర్ తాజాగా ప్రకటించడం భారత ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఇతర దేశాల నుంచి నాఫ్తా కొనాలంటే ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే మూడింతలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు రవాణా మార్గాల్లో (హర్మోజ్ జలసంధి) ఇరాన్ ఆంక్షలు ఉండటంతో సరఫరా పూర్తిగా స్తంభించింది. యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎరువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టన్ను యూరియా ధర వెయ్యి డాలర్లు (రూ. 91,742) దాటే అవకాశం ఉంది.

Read Also: Pentagon drone strategy : యుద్ధంలో చౌక డ్రోన్ లు , చైనాపై ఆధారపడొద్దని హెచ్చరిక

West Asia: War in West Asia.. LPG gas shortage.. Loss to farmers

భారత ఫర్టిలైజర్ అసోసియేషన్ ప్రకారం..

ప్రస్తుతం 850 డాలర్లున్న టన్ను DAP ధర, వెయ్యి డాలర్లకు చేరవచ్చని అంచనా. దేశీయ అవసరాలకు దిగుమతులే కీలకం. ఈ సరఫరా నిలిచిపోతే వచ్చే వేసవి నాట్ల సమయానికి దేశంలో ఎరువుల కొరత తీవ్రమై రైతు సంక్షోభానికి దారితీయవచ్చు. సల్ఫర్, డీఏపీ ముడిపదార్థాలు సరఫరా చేసే సౌదీ అరేబియా, మొరాకో, జోర్డాన్ వంటి దేశాల నుంచి కూడా రవాణా మార్గాలు మూసుకుపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ దిగుమతి చేసుకునే సహజ వాయువులో 40 శాతం (ఏటా 2.7 కోట్ల టన్నులు) ఖతర్ నుంచే వస్తుంది. తమ ప్లాంట్లపై ఇరాన్ దాడులతో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఖతర్ ప్రకటించడంతో ప్రపంచ గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Fertiliser Supply Disruption Global Energy Crisis Impact on Indian Farmers Latest News in Telugu LPG Gas Shortage India Telugu News Today West Asia War 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.