📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Embassies: పటిష్టంగా లేని రాయబార కార్యాలయాలు!

Author Icon By Sudha
Updated: March 6, 2026 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విపత్కర పరిస్థితులు ఎదురైన ప్పుడే పరిపాలన పరమైన లోపాలు బహిర్గతం అవుతాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాచేస్తున్న యుద్ధం కారణంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన భారతీయ పరి పాలనాశాఖ ఎంత బలహీనంగా వుందో అర్థం అవుతోంది. ప్రపంచం లో అత్యంత జనాభా కలిగిన దేశమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మూడో స్థానానికి చేరుకొంటున్న మన దేశానికి సంబంధించిన విదేశీ రాయబార కార్యాలయాల (Embassies) నిర్వహణ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హారించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారతదేశం కంటే ఎంతో తక్కువ జనాభా కలిగిన దేశాలు, ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు సంబంధించిన విదేశీ రాయబార కార్యాలయాల అధికారులు, సిబ్బంది సంఖ్యతో పోల్చుకుంటే విదేశాలలో వున్న మన రాయబార కార్యాలయాల (Embassies)అధికారులు, సిబ్బంది విషయంలో చాలా వెనుకబడి వున్నాం. ఇజ్రాయెల్, ఇరాన్తో సహా అరబ్ దేశాలలో దాదాపు పెద్ద సంఖ్యలో భారతీయు లు పనిచేస్తున్నారని అంచనా. ఒక్క ఇరాన్లోనే వేలాదిమంది భారతీయ వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆకస్మికదాడులు చేయడం, ఆ దాడులలో ఆయుతుల్లా ఖొమేనీ మరణించ డం, ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైన నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల శాఖ ఆయా దేశాలలో నివసిస్తున్న భారతీయులను రక్షించే విషయంలో దేవుడిపై భారం వేయ డం మినహా ఏమి చేయలేని స్థితిలో వుండాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం యుద్ధమేఘాలు ఆకస్మికంగా కమ్ము కోవడంతోపాటు మన దేశానికి చెందిన రాయబార కార్యాల యాలు బలహీనంగా వుండటం ప్రధాన కారణం.

Read Also : SIR 2026: 22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన!

Embassies

2025 నాటి గణంకాల ప్రకారం భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాలలో విదేశీ రాయబార కార్యాలయాలను నిర్వహిస్తోంది. నిబంధ నల ప్రకారం అమోదించిన విదేశీ రాయబారుల సంఖ్య 1177 కాగా, ప్రస్తుతం పనిచేస్తున్న రాయబారుల సంఖ్య 667 మాత్రమే. వీరు కాకుండా న్యూఢిల్లీలో విదేశీ మంత్రిత్వ శాఖలోమరో 334మంది ఐఎఫ్ఎస్ అధికారులు పనిచేస్తు న్నారు. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో అన్ని దేశాల కంటే అత్యధికంగా 274విదేశీ రాయబార కార్యాలయాలను నిర్వహిస్తుండగా తర్వాత స్థానంలో అమెరికా 271 కార్యా లయాలను నిర్వహిస్తోంది. ‘లో ఇనిస్టిట్యూట్ కు చెందిన ఇండెక్స్ ప్రకారం పట్టుమని 10కోట్ల జనాభా కూడా లేని టర్కీ 252, ఫ్రాన్స్ 249, బ్రిటన్ 225 రాయబార కార్యాల యాలను నిర్వహిస్తోంది. ఈ ఇండెక్స్ ప్రకారం భారత దేశం 11వ స్థానంలో వుంది. దీనిని బట్టి ఇండియా రాయబార కార్యాలయాల విషయంలో ఎంత వెనుకబడి వుందో అర్ధం చేసుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం సమితిలో సభ్య దేశంగా వుండే ప్రతిదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో తమ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసు కోవచ్చు. ఈకార్యాలయాలనే ఎంబసీ లేదా విదేశీ రాయబారకార్యాలయాలని అంటారు. ఈ కార్యాలయంలో పని చేసే ప్రధాన అధికారిని విదేశీ రాయబారి లేదా అంబాసిడర్ లేదా హైకమిషనర్ అని అంటారు. వీరికి సహాయకారిగా ఒక డిప్యూటీ అంబాసిడర్ వుంటారు. ఈ కార్యాలయాలలో పర్సనల్/అడ్మినిస్ట్రేషన్ వింగ్, పొలిటికల్ వింగ్, కౌన్సిలర్ వింగ్, కమర్షియల్/ఎకనామిక్ వింగ్, డిఫెన్స్ వింగ్, ప్రెస్కల్చరల్ వింగ్ అనే విభాగాలు వుంటాయి. ఆయా విభా గాలలో ఇన్చార్జ్ అధికారి అధికారితోపాటు సాధారణ ఉద్యో గులు వుంటారు. విదేశాల వైశాల్యం, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను బట్టి రాయబార కార్యాలయాల సిబ్బంది సంఖ్య లో కొంచెం అటుఇటుగా వుంటుంది.

Embassies

ఎంబసీ కార్యాలయా లలో ప్రధాన, ఉప ప్రధాన అధికారులుగా ఇండియన్ ఫారెన్ది సర్వీస్ (ఐఎఫ్ఎస్)/ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ (ఐఎఎస్)లను నియమిస్తారు. ఆయా దేశాలలో మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను తమ దేశాలకు చేరవే యడం, ఆయా దేశాలతో మధ్యవర్తిత్వం నడపడం, తమ దేశం సందర్శించాలనుకొనే వారికి విదేశీయులకు వీసాలు మంజూరు చేయడం, ఆయా దేశాలలోపని/ఉద్యోగం చేసే స్వదేశీ పౌరులకు,టూరిస్టులుగా వచ్చేవారికి మద్దతు గా వుండటం, విపత్కర సమయంలో సాయం అందించడం ఈ రాయబార కార్యాలయాల ప్రధాన లక్ష్యం. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులు తీవ్రమైన భయాందోళనలకు గుర య్యారు. ప్రయాణం మధ్యలో దుబాయ్ వంటి ప్రాంతాల లో విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన టూరిస్టులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణీకుల పరిస్థితి మరీ దారు ణంగా వుంది. యుద్ధం భయం, బాంబుల శబ్దాల కారణం గా ఒకవ్యక్తి మరణించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా అనేకమంది మానసిక డిప్రెసెన్కు గుర య్యారు. ప్రధానంగా ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న మధ్య ప్రాచ్యపాంత దేశాలలోని రాయబార కార్యాలయాలలో మంజూరు చేసిన అధికారుల సంఖ్యే చాలా తక్కువ. మం జూరి సంఖ్యలో పోస్టులు ఖాళీగా కారణంగా ఆయా దేశా లలోజీవిస్తున్న భారతీయులకు, విమానాశ్రయాలలో చిక్కు కుపోయిన ప్రయాణీకులకు తగిన విధంగా ధైర్యం కలిగిం చలేకపోయారు. అదృష్టం కొద్ది కొన్ని విమాన సంస్థలు ధైర్యం చేసి దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానాలు నడపటం వల్ల కొంతమేరకు ప్రజలు కుదుటపడ్డారు. అయితే ఇరాన్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి భయంకరంగానేవుంది. ఇరాన్రాజధాని టెహరాన్లో భారతదేశ రాయబార కార్యాల యం పనిచేస్తున్నప్పటికీ ఎంతమంది అధికారులు, ఉద్యోగు లు వున్నారనే సమాచారం అందుబాటులో లేదు. భారతదేశజనాభాను దృష్టిలో పెట్టుకొంటే ప్రస్తుతం పనిచేస్తున్నరాయ బారుల సంఖ్యను కనీసం రెండు రెట్లు అదనంగా పెంచాల్సి వుంటుంది. ప్రస్తుతం ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన దేశ జనాభాకు అనుగుణంగా రాయబార కార్యాలయాల అధికారులు, సిబ్బంది నియామకంలో భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుదని ఆశిద్దాం.
-అన్నవరపు బ్రహ్మయ్య.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Diplomacy diplomatic missions embassies foreign relations International Relations latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.