నేడు విశ్వం యుద్ధాలతో చాలా భయానక వాతావరణం తలపిస్తోంది. రష్యా, ఉక్రైన్ యుద్ధం ఒక ప్రక్క సాగు తుండగా, మరోప్రక్క ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయు క్తంగా ఇరాన్పై దాడులతో భయకంపితుల్ని చేస్తోంది. ఇరాన్ లో అంతా మరు భూమిని తలపిస్తోంది. అమెరికాకు తోడు గా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తోడుగా నిలిచాయి. ఇరాన్ ప్రక్క హెజబొల్లా, ఇరాకీ మిలీషియా అండగా నిలిచాయి. ఇవి లెబనాన్లోని తీవ్రవాద సంస్థలు. ఇందులో హెజ్మొల్లా భయంకరమైన సంస్థ. ఆకస్మాతుగా ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈదాడులు ఇజ్రాయెల్ తిప్పి కొట్టినా నష్టం జరిగి పోయింది. ఇలా దాడులు, ప్రతి దాడులతో విశ్వం అతలా కుతల మవుతోంది. ఆయా దేశాలలోని పౌరులు ఏ క్షణనా ఏమి జరుగుతుందో అని బిక్కుబిక్కు మంటున్నారు. ఇప్పుడు రష్యా, ఉక్రేన్ యుద్ధం (wars)కంటే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ పరస్పర దాడు లతో మధ్యలో కువైట్, సౌదీ, ఖతార్ తీవ్రంగా నష్టపో తున్నాయి. ఫలితంగానే సౌదిలోని ఆరామ్క చమురు కేం ద్రంపై ఇరాన్ దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది. ఇలా పరస్పర దాడులతో ఏం సాధిస్తాయో అర్థం కావడం లేదు. అసలు తప్పంతా అమెరికా, ఇజ్రాయెల్ దాడులతోనే వచ్చిం ది. ముందు నుంచి ఇరాన్ను మెత్తగా మచ్చిక చేసుకుని మీ అణు స్థావరాలు వాటిలోని నిల్వలను ధ్వసం చేసివుంటే ఏ తగాదా ఉండేది కాదు. దీనికి తోడు ఇరాన్ భద్రత మండలి సెక్రటరీ మేము చర్చలకోసం ప్రయత్నం చేయడం లేదు అనడం గమనార్హం. ఒక విధంగా చుస్తే ఖుమేని లక్ష్యంగా ఇది కొనసాగింది.
Read Also : North Korea: డ్రోన్‌లను తిప్పికొట్టగల కొత్త ట్యాంక్‌ను నడిపిన కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె
ఇజ్రాయెల్ అత్యంత సాంకేతికతతో ‘మోసద్’ అనే క్షిపణితో ఇరాన్ అధినేతను మట్టు పెట్టింది. రంగంలోకి హెజ్మొల్లా రాకపోయి ఉంటే బాగుండేది. ఎందు కంటే ఏడాది క్రితమే ఇజ్రాయెల్, హెజ్మొల్లా మధ్య కాల్పు ల ఒప్పందం జరిగింది. ఇదే విషయం లెబనాన్ చెప్పినా కూడా హెజ్మొల్లా వెన్నక్కి తగ్గలేదు. కాని ఖమేని మృతితో ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇప్పుడు యుద్ధం భీకర రూపం దాల్చుతోంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్, అమెరికాకు కూడా నష్టం వాటిల్లుతోంది. అయితేఇవి ఆ దేశాలు లెక్కచేయవు. మొత్తం ఇరాన్ పూర్తిగా మరు భూమిగా మారాలని అమెరికా, ఇరాన్పై అత్యాధునిక ఆయుధాలు వినియోగిస్తోంది. ఇది ఇలాఉండగా ఇజ్రాయెల్ ప్రకటన మా దాడిలో ఇరాన్ పగ్గా లు చేపట్టిన ఆయాతుల్లా ఆలీ రెజా కూడా మరణించారని వార్త హల్చల్ చేసింది. అయితే ఇరాన్ దీన్ని ధ్రువీకరించ లేదు. ఇలా దేశ నాయకులు దంపుకుంటూపోతే ప్రగతి ఏ దేశమైన ఏమి సాధించలేదు. ఈ యుద్ధాలతోనే వేగలేకపో తుంటే పాక్, ఆఫ్ఘానిస్థాన్ యుద్ధంమరో కోణంలో జరుగుతోం ది. పాక్ నిబెలూ చిస్థాన్ కూడా పాక్పై గుర్రుగా ఉంది. ఇప్పుడు దేశాల మధ్యశాంతి కావాలి, అంతర్జాతీయ చట్టాలు అన్నిదేశాలు పాటించాలి. శాంతిసంస్థ ఐక్యరాజ్యసమితి మధ్య వర్తిత్వంతో దేశాలు యుద్ధం (wars)ముగించిశాంతి పరిమళాలుకురి పించాలి. ఇది ఏస్థాయికి పోతుందో చెప్పలేం. యుద్ధం ఆపడ మా చర్చలు చేయడమా అనేది నాయకులే తేల్చుకోవాలి.
-కనుమ ఎల్లారెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: