సామ్రాజ్యవాద రక్తపిపాసి అమెరికా మరోసారి ఇరాన్పై విరుచుకుపడింది. తనపెంపుడు బిడ్డ ఇజ్రాయిల్తో కలిసి ఇరాన్లోని అనేకప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్సు ఫ్రీమ్నాయకుడు అలీఖమేని హత్యచేసింది. ఇంకా అనేక మంది ఇరాన్ నాయకులు, వందలాది మంది ప్రజలు అమెరికా (America) దాడిలో మరణించారు. 140మంది చిన్నపిల్లలను బాంబులతో చంపివేసింది. ఇజ్రాయిల్, అమెరికా నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తూ మారణకాండ సాగిస్తున్నది. ఆధునిక కాలంలో యుద్ధాలకు మూలం సామ్రాజ్యవాదమే. సామ్రాజ్యవాదుల మోసపూరితమైన శాంతిపంథానూ, దురాక్రమణ పూరితమైన యుద్ధాలను రెండుచేతులా ఉపయోగి స్తారు. తాము జరిపిన దురాక్రమణ యుద్ధాలనూ, యుద్ధ ప్రయత్నాలను శాంతివచనాలు ముసుగుతో కప్పిపెట్టుకో ప్రయత్నిస్తారని లెనిన్మహాశయుడు అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు. సామ్రాజ్యవాద ప్రభుత్వాలు శాంతి గురించి కబుర్లు చెబుతాయి. వాస్తవంలో ఆక్రమణ యుద్ధాలను, బందిపోటు దండయాత్రలను కొనసాగిస్తాయి. సాత్విక వాదాన్ని ప్రచారం చేయడంలో ఒకేఒక్క ఆశయమున్నది. శాంతిని గురించి వాగాడంబరంతో ప్రజలను మోసగించడం దానిచాటున మరో కొత్తయుద్ధానికి సన్నాహాలు చేయడం, ఇదే సామ్రాజ్యవాద ఆవశ్యమని వివరించారు స్టాలిన్. లెనిన్, స్టాలిన్చెప్పిన మాటలు నేడు అమెరికా సామ్రాజ్య వాదానికి వర్తిస్తాయి. అది చేసిన దురాక్రమణ యుద్ధాలకు, సైనిక జోక్యాలకు కమ్యూనిజం, టెర్రరిజం వల్ల ప్రపంచ శాంతికి ప్రమాదం ఏర్పడుతుందని,శాంతి ఏర్పడాలంటే వాటిపై దాడిచేయాలని అమెరికా (America) చెబుతూ తన దురాక్రమణ విధానాలను సమర్ధించుకుంటున్నది. ఇరాన్పై దాడికి ఇలాంటి శాంతిజపాన్నే వల్లిస్తూ ఉన్నది. ఇరాన్ యురేనియం శుద్ధి పెద్దఎత్తున కొనసాగిస్తూ అణ్వాయుధాల తయారీకి సిద్ధమౌతున్నదని, పెద్దఎత్తున మిసైల్స్ ఉత్పత్తి చేసిందని ఇది ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా రక్షణకు చాలాప్రమాదమని అందుకే ఇరాన్ యురేనియం శుద్దికార్య క్రమాన్ని ఆపివేయాలని లేని వెడల దానిపై ఆంక్షలువిధిస్తామని అవసరమైతే దాడికూడా చేస్తామని అమెరికా బెదిరింపులు ప్రారంభించింది.
Read Also: Youssef Pejeskian: మొజ్తాబా ఖమేనీ సురక్షితంగా ఉన్నారు
ఇరాన్ విధానాల వల్ల పశ్చిమాసియాకి ప్రమాదమని ముఖ్యంగా-తనపెంపుడు బిడ్డ ఇజ్రాయెల్కు ప్రమాదమని అమెరికా భావిస్తున్నది. అందుకే ఇరాన్ను తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు అవసరమైన విధా నాలు అమలు జరుపుతున్నది. ఇరాన్ సహజ వనరులు అనేకం ఉన్నాయి. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఇంధన వనరులు కలిగిన దేశం. ప్రపంచంలో 3వ అతిపెద్ద సహజ వనరుల నిల్వలను 2వ అతిపెద్ద సహజవాయువు నిల్వలు కలిగి ఉంది. బొగ్గు, రాగి, సీసం, యురేనియం వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న దేశం. ఇవికాక కుంకుమపువ్వు, పిస్తా వంటి వ్యవసాయ ఉత్పత్తులలో కూడా అగ్ర స్థానంలో ఉంది. ఇరాన్లో 208.6మిలియన్ల చమురు నిల్వలు ఇతర ఖనిజాలు, సుమారు 2 కోట్ల, 20లక్షల టన్నుల స్వచ్ఛమైన బంగారం ఉన్నాయి. వీటి విలువ 27.30 ట్రిలియన్ డాలర్లు. ఇరాన్ విస్తారమైన సహజ వనరులను తన అవసరాలకువినియోగించుకునే విధానాలు అమలు జరిపేలా ఆ దేశపాల కులను అమెరికా ప్రభావితం చేసింది. అమెరికా మద్దతుతో కొనసాగిన షామొహమ్మద్రజాపహలి ప్రభుత్వానికి వ్యతిరే కంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకి షానిరంకుశపాలన, అమెరికా అనుకూల విధానాలు, తీవ్ర ఆర్థిక అసమానతలు, ఇస్లామిక్ సంప్రదాయాలను విస్మరిం చడం, అవినీతి, సామాజిక అణచివేత కారణాలుగా ఉన్నాయి. చమురు కార్మికులు సమ్మెలు చేశారు. ప్రవాసంలో ఉన్న ఖొమేని షా పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చా డు. ప్రజల తిరుగుబాటుతో షా ప్రభుత్వం కూలిపోయింది. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అమెరికా దోపిడీ ప్రయోజ నాలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా ఇరాన్ పట్ల అమెరికా శత్రుత్వ వైఖరి చేపట్టింది. రెండు దేశాల మధ్య సంబంధా లు క్షీణించాయి. ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమం మధ్యప్రాచ్యం లో ప్రభావం చూపింది. తనపెంపు బిడ్డ ఇజ్రాయెలు, తన ప్రయోజనాలకు ఇరాన్ ఆటంకంగా ఉందని అమెరికా భావించింది. దానిపై దాడి చేయడానికి ఉగ్రవాదానికి ఇరాన్ మద్దతు ఇస్తుందనే ప్రచారం అమెరికా ప్రారంభించింది. 1985 నుంచి ఇజ్రాయెల్ను ఇరాన్పై ఘర్షణకు సిద్ధమైంది.
2018లో సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నుండి వైదొలిగిన అమెరికా, ఇరాన్పై అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఇరాన్ ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇరానియని యాల కరెన్సీ విలువ గణనీయంగా తగ్గింది. ఇరాన్తో వ్యాపా రంచేసే అనేక అంతర్జాతీయ బ్యాంకులు భారీ జరిమానాలు చెల్లించాయి. అన్ని ప్రధాన యూరోపియన్ కంపెనీలు అమెరికాకు భయపడి ఇరాన్తో వ్యాపారం మానివేశాయి. ఫలితంగా ఆర్థికంగా ఇరానా బాగా దెబ్బతిన్నది. అ
మెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్, రష్యా, చైనాలతో అనేక ఒప్పం దాలు చేసుకుంది. 2025 జనవరి లో రష్యాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయగా, చైనాతో 2021లో 25 సంవత్సరాల సహకార ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాలు సైనిక, ఆర్థికసహకారానికి పెంచుకోవడానికి ఇరాన్కు తోడ్పడ్డాయి. రష్యాప్రధానంగా ఇరాన్కు ఆయుధ సరఫరాదారుగా ఉంది. చైనాతో కుదిరిన 25 ఏళ్ల సమగ్ర సహకార ఒప్పందం ద్వారా చైనానుంచి ఇరాన్ ఇంధన రంగానికి భారీగా నిధులు పొందింది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా దేశాలు, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని ముఖ్యంగా అమెరికా ఆంక్షలను సవాలు చేయడానికి ఒకభౌగోళిక, రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందాలవల్ల షాంఘై సహ కార సంస్థ బ్రిక్స్వారా సహకారాన్నిపొందుతున్నాయి. రష్యా, చైనాలతో ఒప్పందాలు తనప్రపంచ ఆధిపత్య విధానాలకు ప్రమాదంగా అమెరికా భావించింది. తన ఆధిపత్య విధానా లకు వ్యతిరేకంగా ఉన్న, ఇరానన్ను దెబ్బతీయడానికి ఆదేశం పై దాడులు ప్రారంభించింది. 2003లో, 2024లో, 2025 లో ఇరాన్పై దాడులు చేసింది. వెనిజులాపై దాడి తర్వాత ఇరాన్ను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. దానిపై దాడి చేయడానికి కుంటిసాకులు ప్రచారంచేయడం ప్రారంభించిం ది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నదని దానివల్ల ప్రపంచానికి, అమెరికాకు ప్రమాదమని పేర్కొంది. యురేని యంశుద్ధిని, అణ్వాయుధాల తయారీని మానుకోవాలని అందుకు చర్చలకు రావాలని, చర్చలకురాకపోతే ఇరాన్పై దాడిచేస్తామని బెది రించింది. ఇరాన్ చర్చలకు ఆమోదం తెలిపింది. రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. జెనీవా లో రెండవ రౌండ్ చర్చల జరగాల్సి ఉంది. ఇరాన్పై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణదాడిని ప్రపంచ ప్రజలూ ఖండించి దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి.
-బొల్లిముంతసాంబశివరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: