మనదేశంలో ఓటరు ద్వారా ఎన్నుకోబడిన రాజకీయ పార్టీల పరిపాలన వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్క ఓటరు విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుత పార్లమెంటరీ పరిపాలన విధానంలో ఓటు విలువ నేడు చాలా మందికి తెలిసిందే. అయినా ఓటర్లు అనేక ప్రలోభాలకు లొంగిపోయి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనడంలో ఎంత మాత్రం సందేహం అక్కర్లేదు. నేడు ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగాని, చిన్న పార్టీల అభ్యర్థులు గాని ఎక్కడా మూడు అంకెల ఓట్లైనా పొందిన దాఖలాలు కనబడవు. వీరిలో ఎంతమంచివారున్న, నిత్యసంఘ సేవకులు, నిజాయితీపరులు, నిస్వార్థపరులున్న, దేశం, రాష్ట్రం పాడైపోత్నుదన్న ఆవేదనతో, ఆందోళనతో సొంత డబ్బునే ఖర్చు పెట్టుకుని, ఎంత ప్రచారం చేసినా ఫలితాలు ఎంత అన్యాయంగా ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కొంతమంది అయినా స్వతంత్ర అభ్యర్థులు, స్థానిక పార్టీల అభ్యర్థులు గెలిచేవారు. చట్టసభలలో వారి గళం గట్టిగా వినిపించేవారు. ఈవేళ ఆ పరిస్థితులు లేవు. అందుకు గల కారణాలను నేడు ప్రతి ఒక్క ఓటరు (Voter)విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత అధికార, ప్రతిపక్షపార్టీల పరిపాలన నేడు ఏ విధంగా ఉందో తెలిసికూడా వారు ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టినా ఆ పార్టీలకే ఓటు వేయా లనుకోవడం ఎంతవరకు సమంజసమో ప్రతి ఓటరు ఆలో చించాలి. నేటి ఓటర్లు పార్టీలుగా, మతాలుగా, కులాలుగా విడిపోయి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకో వడం దేశానికి, రాష్ట్రాలకు ఎంత మాత్రం మంచిది కాదు.
Read Also : Telangana Budget updates: డ్వాక్రా మహిళలకు ₹2,500 కోట్ల వడ్డీలేని రుణాలు
చదువుకున్న, విజ్ఞానవంతులైన వారు అనుకున్నవారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిపాలన విధానాలపై స్పష్ట మైన అవగాహన ఉన్నవారు కూడా ఆయా పార్టీల ప్రలో బాలకులోనై ఓటు వేయడం వల్ల ఇప్పుడు ఏమి జరుగు తుందో తెలుస్తోంది గదా! మధ్యతరగతి, పేదవారు ప్రత్య క్షంగా డబ్బు, మద్యం, సంక్షేమ పథకాల రూపంలో వారి బ్యాంకు ఎకౌంట్లో వేస్తున్న డబ్బులకు దాసోహమై ఓటు వేస్తుంటే వీరిని ఎవరు మార్చాలి? అభ్యర్థులు ఎన్నికలలో ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయల ధనం, వారికి, బ్యాంకు ఖాతాలలో అధికారికంగా సంక్షేమ పథకాల పేరుతో వేస్తున్న ప్రజాధనం ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుందో ఓటర్ల (Voter)కు తెలియదా? తెలుసుకోవలసిన అవసరం లేదా? కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్ర, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తమ బాగోగుల విషయంలో అపరితమైన, అసాధ్యమైన హామీలు గుప్పించిన వారికే ఓట్లు వేస్తున్నారు. తర్వాత వాటిని అమలు చేయకపోతే ఉద్యమాలకు దిగుతు న్నారు. ఓడిస్తామని బెదిరిస్తున్నారు. కానీ ప్రజాధనం నెల నెలా జీతంగా తీసుకుంటూ వారి ఉద్యోగ ధర్మంపై ఆధార పడ్డ ప్రజల పనుల విషయంలో ఏం చేస్తున్నారో తెలియ నిది ఎవరికి? ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే ఎన్ని పాట్లు పడాలో అనుభవం లేనిదిఎవరికి? ఇందుకు ప్రభుత్వం లో అత్యున్నత స్థాయిలో ఉండే బ్యూరోక్రాట్లు కూడా ఎంత మాత్రం అతీతులు కారు. అత్యధికులు రాజకీయ పార్టీలకు వత్తాసులుగా మారి ఓటు హక్కును వినియోగించుకుంటు న్నారు. అంతేకాక ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నవారు కూడా కొందరు ఉంటున్నారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితులలోచాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కథనాలు చెప్తుంటారు. కొందరు వివాదాలకూ దిగుతుంటారు. అభ్యర్థి ఎవరైనా సరే గెలిచే వారికే మేము ఓటు వేస్తాం. మా ఓటును ఆ విధంగానే సద్వినియోగం చేసుకుంటామని కొందరు అంటే, మరికొందరు గెలవని వారికి ఓటువేస్తే మా ఓటు వృధా అవుతుంది అంటున్నారు. ఇంకొందరు ఎవరికి ఓటు వేసిన మనకు ఒరిగేది ఏమిలేదు. ఎవరో ఒకరికి వేస్తాం. లేకపోతే ఓటే వేయం అంటున్నారు. కొందరు ఆ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తమ పార్టీ వారినే గెలిపించుకోవాలని ఓట్లు వేసుకుంటామం టున్నారు. అంతేగాని మంచి పరిపాలన అందించే అభ్యర్థు లకే ఓట్లు వేస్తామని చెప్పేవారు లేకపోవటం చాలా దుర దృష్టకరం. ఇదే ఇప్పుడు ఈ దేశానికి పెట్టిన అతిపెద్ద దౌర్భాగ్యం.
ప్రతి లోక్సభ, శాసనసభ నియోజకవర్గంలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలతో పాటు ఆయా రాష్ట్రాలలో రిజిస్టరైన, ఈసీఐ గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వ తంత్ర అభ్యర్థులు మొత్తం మీద 30 నుంచి 40 మంది అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపర్లో ఉంటున్నాయి. అయితే అందులో ఒక పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు, ప్రత్యర్థి పార్టీ ఓట్లు చీల్చేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు లేకపోలేదు. నిజానికి ఈ దశాబ్దాపు ఎన్నికలలో వీరి బెడద ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకుపరో క్షంగా చేదోడు వాదోడుగా ఉండేందుకు కొందరు అభ్యర్థులను వివిధ చిన్న పార్టీల తరఫునగాని, స్వతంత్రంగా గాని పోటీకి దించుతున్నాయి. ఈ విధంగా మన ఎన్నికల వ్యవస్థ, రా జ్యాంగబద్ద ఈసీఐ నిబంధనకు లోబడే ఎవరు ఏమి చేయ లేని విధంగా ‘వెర్రి తలలు’ వేస్తోంది. ఎన్నికలపై విరక్తి చెం దినవారు కొందరైతే, తమ వారినే గెలిపించుకోవాలని పట్టు దల గలవారు కొందరు. గతంలో ఓటర్లలో అత్యధిక శాతం మందిలో మంచిచెడుల విచక్షణ, సమాజ సమగ్ర అభివృద్ధి వంటి విశాల దృక్పథం ఉండేది. అందువలనే స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు ఎన్నికలలో విజయం సాధించేవారు. ఆరోజుల్లో అభ్యర్థిని చూసి ఓటు వేసేవారు. కనుకనే వారు గెలిచేవారు. నేడు ఎన్నికలలో అభ్యర్థిని చూడడమే మర్చిపోయారు. ఒకవర్గం ఓటర్లు కేవలం కులం, మతం, పార్టీకే ప్రాధాన్యత ఇచ్చి ఆయా అభ్యర్థుల ఎలాంటి వారైనా మాకేమి సంబంధం లేదని ఓట్లు వేస్తుంటే మరో వర్గం సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని వారి బ్యాంకుఖాతాలో నెలనెలా వేసేవారికి అందులోనూ ఎక్కు వ మొత్తంలో వేసేవారికే ఓటు వేస్తున్నారు . ఇక మూడవ వర్గం డబ్బు, మద్యం వంటి ఆరోజు తాత్కాలిక తాయిలా లకు లొంగిపోయి ఓటేస్తున్నారు. దేశ, రాష్ట్రాల భవిష్యత్తు ఐదేళ్లకు ఒకసారి ఓటరు చేతిలోకి వస్తుంది. అప్పుడు ఆలోచించి, నిస్వార్థంగా, కుల, మత, పార్టీలకతీతంగా మంచి అభ్యర్థిని ఎంచుకొని ఓటుహక్కు వినియోగించుకుంటే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఓటు మన ప్రజాస్వామ్యయుత పరిపాలన వ్యవస్థకు మూలాధారం. పునాది. కేవలం ఓటర్ల విచక్షణాయుత ఓటు హక్కు విని యోగంపైనే మన దేశ, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అంటే మన దేశ భవిష్యత్తు మన దేశ పౌరుడైన ఓటర్ చేతుల్లో, చేతల్లోనే ఉంది.
-డాక్టర్ టి. సేవకుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: