అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి (Hawaii)లో అగ్నిపర్వతం (Hawaii volcano) బద్ధలైంది. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాల్లో ఒకటిగా పేరుగాంచిన ‘కిలోవేయ’ (Kilauea) మరోసారి విస్ఫోటనం చెందింది. దాని నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది. వెయ్యి అడుగులకుపైనే లావా ఫౌంటెయిన్‌లా ఎగసిపడుతోంది. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ విస్ఫోటనం దాదాపు పది గంటలపాటూ నిర్విరామంగా కొనసాగింది. అగ్నిపర్వతం నుంచి వచ్చిన లావా 13 వందల అడుగలు ఎత్తువరకూ ఫౌంటెయిన్‌లా ఎగసిపడింది. దీంతో ఆ ప్రాంతమంతా ఎర్రటి వర్ణాన్ని సంతరించుకుంది. విస్ఫోటనం ధాటికి వెలువడిన పొగ, బూడిద సుమారు 35 వేల అడుగుల ఎత్తు వరకు వ్యాపించింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: AmritBharat Train: అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
అతి పురాతన అగ్నిపర్వతం
హవాయి ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటి. 1983 నుంచి కిలోవేయ అగ్నిపర్వతం క్రియాశీలకంగా ఉంది. దీన్ని అతి పురాతన అగ్నిపర్వతంగా అభివర్ణిస్తుంటారు. ఇది హోనోలులుకు (Honolulu) దక్షిణంగా దాదాపు 200 మైళ్ల దూరంలో ఉన్నది. యూఎస్ జియోలాజికల్ ప్రకారం ప్రకారం ఇది సెకనుకు సగటున 6,750 క్యూబిక్ అడుగుల లావాను ఉత్పత్తి చేస్తుందని అంచనా.
ఈ అగ్నిపర్వతం వరుసగా విష్ఫోటనం చెందుతోంది. 2024 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 40 సార్లకుపైనే బద్ధలైంది. ఈ అగ్నిపర్వతం ఒక క్రమ పద్ధతిలో స్పందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రతి విస్ఫోటనం 12 గంటల లోపే ముగుస్తోంది. ఒక విస్ఫోటనం తర్వాత మరోసారి లావా చిమ్మడానికి కొన్ని రోజుల నుండి రెండు వారాల వరకు సమయం తీసుకుంటోందని పేర్కొంటున్నారు. తదుపరి విస్ఫోటనం మార్చి మొదటి వారంలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: