దళపతి విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్న ‘జన నాయకుడు’ చిత్రం జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, విజయ్ (Vijay) నటిస్తున్న చివరి చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. సినిమా తమిళ వెర్షన్ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ట్రైలర్ జనవరి 3న విడుదల కానుంది.ఈ ట్రైలర్ ద్వారా కథపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Read also: Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ ఎప్పుడంటే?
బుకింగ్స్ సునామీ
అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ సృష్టిస్తున్నాయి. కేవలం విదేశీ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం ఇప్పటివరకు రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.. ‘జన నాయకుడు’ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే ప్రచారంపై దర్శకుడు హెచ్. వినోద్ స్పందిస్తూ, ‘నేను ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేయను, అలాగే కొట్టిపారేయను. వచ్చి సినిమా చూడండి’ అని అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: