📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijay Deverakonda: ఫిబ్రవరి 26న ఒక్కటవ్వబోతున్న విరోష్, రష్మిక

Author Icon By Vanipushpa
Updated: February 23, 2026 • 1:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) త్వరలోనే స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.ఈ నెల 26న ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు వారిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. ఈ వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. 2026లో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మక సెలబ్రిటీ వివాహాల్లో ఇది ఒకటిగా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి విషయాన్ని ప్రకటిస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Read Also: US Education Report: అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్

Vijay Deverakonda: Virosh, Rashmika to get married on February 26th

“వెడ్డింగ్ ఆఫ్ విరోష్”

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించిన Vijay Deverakonda, తమ వివాహ వేడుకకు “వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అనే పేరు పెట్టినట్లు తెలిపారు. అభిమానులు ప్రేమగా తమ జంటను “విరోష్” అని పిలుస్తుండటంతో.. అదే పేరును పెళ్లి వేడుకకు పెట్టినట్లు వెల్లడించారు.ఇదే సందర్భంగా పెళ్లి ఆహ్వాన పత్రాన్ని కూడా అధికారికంగా షేర్ చేస్తూ.. ఈ సంతోషకరమైన క్షణాన్ని అభిమానులతో పంచుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట తొలిసారి గీత గోవిందం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా, ఈ జంటకు ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని కూడా ఏర్పరిచింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి కలిసి నటించి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

స్నేహం ప్రేమగా మారిందనే వార్తలు

ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం ప్రేమగా మారిందనే వార్తలు వినిపించాయి. ప్రారంభంలో ఈ విషయంపై ఇద్దరూ మౌనంగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా తమ సంబంధాన్ని బహిరంగంగానే అంగీకరించినట్లు కథనాలు వచ్చాయి.తాజా ప్రకటనతో మొత్తం క్లారిటీ వచ్చేసింది. పెళ్లికి డబ్బులు లేవని బాధపడకండి, ఈ బ్యాంక్‌ మీకు రూ.50 లక్షల వరకు రుణం ఇస్తుంది రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. ఆమె కన్నడ సినిమా కిరిక్ పార్టీతో నటిగా అరంగేట్రం చేసింది. కర్ణాటకలోని కొడగు జిల్లా నుంచి వచ్చిన ఈ భామ.. తక్కువ కాలంలోనే కన్నడ నుంచి తెలుగు, తమిళం, ఆపై బాలీవుడ్ వరకు తన ప్రతిభను చాటింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదిస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Celebrity relationship rumours February 26 event Rashmika Mandanna Telugu film industry buzz Telugu News Paper Telugu News Today Tollywood celebrity news Vijay Deverakonda Virosh updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.