Telangana: మార్చి 1 నుంచి పెర‌గ‌నున్న వాహ‌నాల ధ‌ర‌లు

Read Time:  1 min
మార్చి 1 నుంచి పెర‌గ‌నున్న వాహ‌నాల ధ‌ర‌లు
మార్చి 1 నుంచి పెర‌గ‌నున్న వాహ‌నాల ధ‌ర‌లు
FONT SIZE
GET APP

కొత్త‌గా వాహ‌నాలు కొనుగోలు చేసే వారికి ఇది షాకింగ్ వార్త‌. తెలంగాణ‌(Telangana)లో మార్చి 1వ తేదీ నుంచి వాహ‌నాల ధ‌ర‌లు భారీగా పెరిగిపోనున్నాయి. ఎందుకంటే ర‌హ‌దారి భ‌ద్ర‌త ప‌న్ను చెల్లించాల‌నే నిబంధ‌న‌ను అమ‌లు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కొత్త వాహ‌నాల కొనుగోలుపై ర‌హ‌దారి భ‌ద్ర‌త పన్నును చెల్లించాల‌నే నిబంధ‌న‌ను మార్చి 1 నుంచి అమ‌లు చేయ‌నున్నారు. మోటారు వాహనాల చట్టంలో పన్నుల విధింపుపై రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగిస్తూ ఈ మేరకు రవాణాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Maoist Leader Ganapati: లొంగుబాటు దిశగా మావోయిస్టు అగ్రనేత

Vehicle prices to increase from March 1
Vehicle prices to increase from March 1

టూ వీల‌ర్‌కు రూ. 2 వేలు

ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం టూ వీల‌ర్‌కు రూ. 2 వేలు, తేలిక‌పాటి వాహ‌నాల‌కు రూ. 5 వేలు, ఇత‌ర వాహ‌నాల‌కు రూ. 10 వేలు అద‌నంగా చెల్లించాల్సి ఉంది. అంటే నాన్ ట్రాన్స్‌పోర్టు వాహ‌నాల‌పై రోడ్ సేఫ్టీ ప‌న్నును కొనుగోలు స‌మ‌యంలోనే చెల్లించేలా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ర‌వాణా శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం కొత్త వాహ‌నాల‌ను కొనుగోలు చేసి రిజిస్ట్రేష‌న్ చేయించుకునే స‌మ‌యంలోనే ఈ అద‌న‌పు చెల్లించాల్సి ఉంటుంది. త్రీ వీల‌ర్ గూడ్స్ వాహనాలపై గతంలో త్రైమాసిక పన్ను ఉండేది. రవాణాశాఖ దాన్ని లైఫ్‌ట్యాక్స్‌ పరిధిలోకి తీసుకువచ్చింది. రోడ్డు భద్రత చర్యలకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా సుమారు రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లకు పన్ను మినహాయింపు ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.