📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India friendly with Russia: అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో.. రష్యాతో స్నేహానికి భారత్‌కు లైన్ క్లియర్

Author Icon By Vanipushpa
Updated: February 26, 2026 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు..ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసిన సంగతి విదితమే. ఇది చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ప్రపంచ దేశాలకు భారీ ఉపశమనం లభించింది. ముఖ్యంగా భారతదేశానికి ఇది చాలా మేలు చేసింది. దిగుమతి సుంకాలను ఏకపక్షంగా విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా.. భారత్-రష్యా(IndiaRussia) ఇంధన వాణిజ్యంపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఈ పరిణామం నేపథ్యంలో, భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించగలదా అనే అంశంపై అంతర్జాతీయంగా కొత్త చర్చ మొదలైంది. CNBC ఇంటర్నేషనల్ ప్రచురించిన వివరణాత్మక నివేదిక ప్రకారం.. ఈ కోర్టు తీర్పు భారతదేశ ఇంధన వ్యూహానికి అనుకూలంగా మారింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విస్తృత స్థాయిలో దిగుమతి సుంకాలు విధించే చట్టపరమైన అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో, రష్యా నుంచి చమురు దిగుమతుల ఆధారంగా భారత్‌పై అదనపు సుంకాలు విధించే అవకాశాలు పరిమితమయ్యాయి.

Read Also: Bijapur Encounter : బీజాపూర్‎లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

With the US Supreme Court ruling, the line is clear for India to be friendly with Russia.

ఇంధన నిపుణుల అభిప్రాయం ప్రకారం..

భారతదేశం తన ఇంధన అవసరాలు, ధరల ప్రయోజనం, సరఫరా భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యన్ చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయడం అసంభవం. క్విన్సీ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ సౌత్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సారంగ్ షిడోర్ మాట్లాడుతూ.. ఇంధన రంగంలో సహా రష్యాతో భారతదేశం మంచి సంబంధాలను కొనసాగిస్తుంది. అవసరమైతే దిగుమతులు కొంత తగ్గవచ్చు, కానీ పూర్తిగా ఆపడం జరిగే అవకాశాలు తక్కువని అన్నారు. ఇంధన డేటా సంస్థ క్ప్లర్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో భారత్ రోజుకు సగటున 1.16 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును దిగుమతి చేసుకుంది. ఇది 2025 సగటు రోజువారీ దిగుమతులైన 1.71 మిలియన్ బ్యారెళ్లతో పోలిస్తే తక్కువ.

US-భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం

US-భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తర్వాత భారత శుద్ధి కర్మాగారాలు కొత్త రష్యన్ చమురు ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ధోరణి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బంగారంతో సరికొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. గురి చూసిన కొట్టిన దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిల.. నిపుణుల అంచనాల ప్రకారం.. భారత్ రష్యా నుంచి రోజుకు 8 లక్షల నుంచి 1 మిలియన్ బ్యారెళ్ల వరకు చమురు దిగుమతులను చేయగల స్థితిలో ఉంది. గతంలో రష్యన్ చమురు కొనుగోళ్లు భారత్-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Geopolitics India Russia friendship India-Russia relations International Diplomacy Latest News in Telugu US foreign policy US Supreme Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.