📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UK: ఇరాన్‌పై అమెరికా దాడులకు యత్నం..వైమానిక దాడులకు యూకే నో

Author Icon By Vanipushpa
Updated: February 20, 2026 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం విషయంలో ఇరుదేశాల్లో సందిగ్ధత వీడటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. మరో 10 రోజుల్లో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్‌ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశంలో రాజీకి రాకుంటే సైనిక చర్య తప్పదంటూ తేల్చిచెప్పారు. దీంతో ఇరాన్‌పై దాడులు చేసేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్‌పై దాడులు చేసేందుకు ముందుగా యూకే ఎయిర్‌బేస్‌ను సాయం అడిగింది. కానీ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ సర్కార్‌ అమెరికా అభ్యర్థనను తిరస్కరించింది. డియాగో గార్షియా, RAF వైమానిక స్థావరాల నుంచి ఈ దాడులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా చేయడం ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందనే కారణంతో దీన్ని రిజెక్ట్ చేసింది.

Read Also: OpenAI Bengaluru Office: ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

UK: US attempts to attack Iran..UK says no to airstrikes

యూకే విధానంలో కీలక మార్పులు

వాస్తవానికి 2001 తర్వాత యూకే విధానంలో కీలక మార్పులు వచ్చాయి. మిత్రదేశానికి చట్టవిరుద్ధ దాడికి సహకరిస్తే బ్రిటన్ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వడంలో బ్రిటన్‌ అలెర్ట్‌గా ఉంటోంది. గతంలో కూడా అమెరికా ఇరాన్‌పై దాడులు చేసినప్పుడు యూకే నేరుగా పాల్గొనలేదు. కేవల రక్షణ చర్యల్లో మాత్రమే సహకరించింది. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్‌ సోషల్‌లో విమర్శలు చేశారు. చాగోస్ దీవులపై నియంత్రణను వదులుకోవద్దని హెచ్చరించారు. ప్రమాదకరమైన పాలన ద్వారా జరిగే దాడిని అడ్డుకునేందుకు అమెరికాకు డియెగో గార్షియా, RAF ఎయిర్‌బేస్ అవసరం కావొచ్చని హెచ్చరించారు. అమెరికా దీర్ఘదూర ఆపరేషన్లకు డియాగో గార్షియా అనేది కీలక ఎయిర్‌బేస్‌గా ఉంది. మరోవైపు అమెరికా ఇరాన్‌ ముందు మూడు ప్రతిపాదనలు చేసింది. ఒకటి ఇరాన్‌ తమ యూరేనియం శుద్ధిని పూర్తిగా ఆపేయాలి. రెండవది ఇరాన్ అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను వదులుకోవాలి. మూడోవది పశ్చిమాసియాలో తీవ్రవాద గ్రూపులకు సపోర్ట్ చేయకూడదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Airstrikes Debate Geopolitics International Relations middle east conflict military strategy Telugu News Paper Telugu News Today United Kingdom Response US Iran tensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.