📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump: గ్రీన్‌ల్యాండ్‌ పై అమెరికా బలప్రయోగం..ట్రంప్ పై అంతా ఉత్కంఠ

Author Icon By Vanipushpa
Updated: January 19, 2026 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని బల ప్రయోగంతో సొంత చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ (Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరికలు చేశారు. గ్రీన్‌ల్యాండ్ తమ భద్రతకు కీలకమని యూఎస్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే, డెన్మార్క్ ప్రధాని మాత్రం ఇది నాటో కూటమికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. గతవారం వెనుజులా‌పై సైనిక చర్యను చేపట్టి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా తీసుకున్న అమెరికా చూపు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్‌లాండ్‌‌‌పై పడింది. దానిని స్వాధీనం చేసుకోడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్‌ తీవ్రంగా స్పందించింది. ఆ దీవిలో అడుగుపెడితే కాల్చిపడేస్తామని అమెరికాకు డెన్మార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

Read also: Silver price today: వెండి ధర షాక్! రూ.3 లక్షల మార్క్ దాటబోతోందా?

Trump: గ్రీన్‌ల్యాండ్‌ పై అమెరికా బలప్రయోగం..ట్రంప్ పై అంతా ఉత్కంఠ

ట్రంప్ పై డెన్మార్క్ ప్రధాని ధ్వజం

గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు విక్రయించే ప్రసక్తే లేదని డెన్మార్క్ ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, గ్రీన్‌లాండ్ దక్కించుకోవడానికి ట్రంప్ తాజాగా ఎనిమిది యూరప్ దేశాలపై (డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటివి) భారీ సుంకాలను ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ మెటె ఫ్రెడెరిక్సన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. బ్లాక్‌మెయిలింగ్‌కు తావులేదు: “యూరప్ ఎవరి బెదిరింపులకు తలొగ్గదు, బ్లాక్‌మెయిల్ కాబోదు” అని ఆమె స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగమని, దాని భవిష్యత్తును అక్కడి ప్రజలు, డెన్మార్క్ మాత్రమే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అమెరికా ఒక మిత్రదేశంపై సైనిక చర్య లేదా ఆర్థిక ఆంక్షల ద్వారా ఒత్తిడి తేవడం అనేది నాటో (NATO) కూటమి ఉనికికే ప్రమాదమని ఆమె హెచ్చరించారు.

గ్రీన్‌లాండ్ ప్రజల నిరసన

గ్రీన్‌లాండ్ రాజధాని నూక్ లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి అమెరికా ప్రయత్నాలను నిరసిస్తున్నారు. “గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు”అనే నినాదాలతో వారు హోరెత్తిస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికా మరియు యూరప్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ జోలికి వస్తే చూస్తూ ఉరుకోబోమని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు చేసింది. గ్రీన్‌లాండ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఒకవేళ గ్రీన్‌లాండ్‌లోకి అమెరికా చొరబడితే సైన్యం ముందు కాల్పులు జరిపి తర్వాత ప్రశ్నలు అడగాలి.. 1952 సైనిక నిబంధన ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూడకుండానే చొరబాటుదారులపై దాడి చేయొచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Arctic region Denmark Donald Trump European Union Greenland Crisis international tensions NATO Telugu News online Telugu News Today United States Use of Force

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.