📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US: రష్యా చమురుపై భారత్ మాకు హామీ ఇచ్చింది అంటున్న అమెరికా

Author Icon By Vanipushpa
Updated: February 16, 2026 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-అమెరికా మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని అమెరికా చెప్పింది. దీనిపై భారత్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా రష్యా మాత్రం భారత్ మాకు ఆ విషయం చెప్పలేదని తేల్చింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి భారత్ చమురు కొనుగోలు చేసినా తమకు ఏ ఇబ్బంది లేదని చెప్పింది. ఈక్రమంలోనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) మరోసారి ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపి వేసేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ తాజాగా ప్రకటించారు. జర్మనీలోని మ్యూనిక్ భద్రతా సదస్సులో ప్రసంగించిన ఆయన.. ఈ విషయంలో ఢిల్లీ నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని ధృవీకరించారు.

Read Also: WSJ Report: చైనా స్కీయర్లకు రహస్యంగా కోట్ల నిధులు

US: రష్యా చమురుపై భారత్ మాకు హామీ ఇచ్చింది అంటున్న అమెరికా

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ గురించి మాట్లాడుతూ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపివేసేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారతీయ ఉత్పత్తులపై గతంలో విధించిన 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది. ఇదీ చూడండి: మా చమురు కొనుగోలు ఆపేస్తామని భారత్ చెప్పలేదు.. అమెరికాతో ట్రేడ్ డీల్‌ వేళ రష్యా సంచలన ప్రకటన జాతీయ ప్రయోజనాలే పరమావధి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్తూ వస్తోంది. తక్కువ ధరకు లభించే రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా తన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అని ఢిల్లీ వాదిస్తూ వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

crude oil trade energy diplomacy Geopolitics global energy market india India-US Relations International Sanctions Latest News in Telugu russia Russian Oil Imports Telugu News Paper United States

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.