అమెరికా(America)-బంగ్లాదేశ్(Bangladesh)లు సోమవారం పరస్పర వాణిజ్య ఒప్పందం (రెసిప్రొకాల్ ట్రేడ్ డీల్)పై సంతకం చేశారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్, బంగ్లాదేశ్ వాణిజ్య, వస్త్ర, జ్యూట్, పౌరవిమానయాన, పర్యాటక శాఖల సలహాదారు షేక్ బషీర్ ఉద్దీన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ వాణిజ్య కార్యదర్శి మహబూబూర్ రెహమాన్, అసిస్టెంట్ అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ కూడా పాల్గొన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక గొప్ప ముందడుగు అని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్టీఆర్) పేర్కొంది.
Read Also: Sharad Pawar Health : కోలుకుంటున్న శరద్ పవార్
టారిఫ్‌లను 20 శాతం నుంచి 19 శాతానికి తగ్గించనున్నది
“అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా కార్మికులు, వ్యాపారులకు నిజమైన ఫలితాలను అందించే వాణిజ్య విధానాన్ని యూఎస్ అనుసరిస్తోంది. బంగ్లాదేశ్‌తో కుదిరిన ఈ ఒప్పందం దక్షిణాసియాలోనే మొదటిది. ఇది మార్కెట్లను తెరవడానికి, వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి వీలు కల్పిస్తుంది. అమెరికన్ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది.” గతేడాది ఆగస్టులో అగ్రరాజ్యం అమెరికా, ఏకంగా 37 శాతం సుంకాలను బంగ్లాదేశ్‌పై విధించింది. తరువాత దానిని 20 శాతానికి కుదించింది. తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల అమెరికా, బంగ్లాదేశ్‌పై విధించిన టారిఫ్‌లను 20 శాతం నుంచి 19 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. అంటే కేవలం 1 శాతం మాత్రమే సుంకాలు తగ్గాయి.
బంగ్లాదేశ్ కంటే అగ్రరాజ్య అమెరికాకే లాభదాయకం
భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందం వల్ల, ఇండియాపై విధించిన సుంకాలు టారిఫ్‌లు 18 శాతానికి తగ్గాయి. దీనితో వస్త్ర పరిశ్రమ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన బంగ్లాదేశ్‌లో గుబులు మొదలైంది. దీనితో దేశంలో ఎన్నికల వేళ భారత్ కంటే తక్కువ టారిఫ్‌లు ఉండేలా అగ్రరాజ్యంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేసింది. కానీ దీని వల్ల దానికి ఏమీ ఉపయోగం లేకపోయింది. కేవలం 1 శాతం మాత్రమే టారిఫ్‌లు తగ్గాయి. ఇలా చూసినా బంగ్లాదేశ్‌పై విధించిన సుంకాలు, భారత్ కంటే ఎక్కువే కావడం గమనార్హం. మరోవైపు చూస్తే, ఈ ట్రేడ్ డీల్ వల్ల అమెరికా వ్యవసాయ,
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: