గతవారం భారత్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక పర్యటన దక్షిణాసియా భౌగోళిక రాజకీయ సమీకరణాలను మలుపుతిప్పింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు పరోక్షంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. షేక్ నహ్యాన్ మూడు గంటల పర్యటన తర్వాత.. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రణాళికను యూఏఈ రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం ఆగస్టు 2025 నుంచి చర్చల్లో ఉంది. దీనిని పాక్ పత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ధ్రువీకరించింది. ఈ ప్రాజెక్టుపై అబుదాబి ఆసక్తి కోల్పోవడం, కార్యకలాపాలను ఔట్‌సోర్స్ చేయడానికి స్థానిక భాగస్వామిని పేర్కొనడంలో విఫలం కావడంతో ఈ ప్రణాళికను నిలిపివేసినట్లు నివేదించింది. పాక్ మీడియా నివేదిక ఈ ఒప్పందం రద్దును రాజకీయ కారణాలతో ముడిపెట్టలేదు. అయితే, ఇది యూఏఈ, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉన్న రియాద్, అబుదాబి.. యెమెన్‌లో ప్రత్యర్థి వర్గాలకు మద్దతు విషయంలో బహిరంగంగా విభేదిస్తున్నాయి.
Read Also: Iran Protests: ఇరాన్‌పై దాడి యోచన రద్దు చేసిన ట్రంప్
పాకిస్థాన్‌తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం
పాకిస్థాన్‌తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, టర్కీతో కలిసి ‘ఇస్లామిక్ NATO’ను ఏర్పాటు చేయాలని సౌదీ కోరుకుంటోంది. మరోవైపు, పాక్ సైనిక నైపుణ్యంపై సౌదీ ఆధారపడుతుండగా.. భారత్‌తో యూఏఈ కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట వరకు పాకిస్థాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా యూఏఈ ఉండేది. వివిధ రంగాల్లో వేలాది మంది పాకిస్థానీయులు పనిచేయడంతో విదేశీ మారక ద్రవ్యం కు కీలక వనరుగా ఉండేది. ఇరు దేశాలు రక్షణ, ఇంధనం, పెట్టుబడి ప్రాజెక్టులలో పరస్పరం సహకరించుకున్నాయి. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ, పాకిస్థాన్‌లోని భద్రతా సమస్యలు, లైసెన్సింగ్ వివాదాలు, పాడుబడిన మౌలిక సదుపాయాల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. మోదీ- బిన్ జాయెద్ సమావేశం తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటన దీర్ఘకాలిక భౌగోళిక, ఆర్థిక సంబంధాలకు ఒక బ్లూప్రింట్‌లా ఉంది. ఈ పర్యటన సందర్భంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశారు. ఇది రక్షణ సహకారంపై ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి మార్గం సుగమం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: