📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Tirumala Summer Arrangements: తిరుమల వేసవి ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

Author Icon By Siva Prasad
Updated: February 20, 2026 • 11:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala Summer Arrangements: త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టనున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు-మూడు ఏళ్ల వేసవి డేటాను విశ్లేషించి, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించేలా పక్కా వ్యూహాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Trump reaction obama : ఒబామా ఏలియన్ల వ్యాఖ్యలు కలకలం, రహస్యాలు వెలిబుచ్చారన్న ట్రంప్

భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తుల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ పాయింట్లను పెంచనున్నట్లు అదనపు ఈవో వెల్లడించారు. మాడ వీధులు, రద్దీ ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ వేయడంతో పాటు, నడకదారి భక్తులకు అవసరమైన చోట్ల షెడ్లను నిర్మించనున్నారు. నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీటి సరఫరా జరిగేలా చూడటమే కాకుండా, వైద్య సదుపాయాలను మరింత బలోపేతం చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Tirumala Summer Arrangements: ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ

ఈసారి రద్దీని నియంత్రించేందుకు టీటీడీ అధునాతన ‘ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్’ టెక్నాలజీని వినియోగించనుంది. దీని ద్వారా క్యూలైన్లలో భక్తుల ఇన్-అవుట్ ఫ్లోను ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ, వేచి ఉండే సమయాన్ని బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోనున్నారు. గత వేసవిలో రోజుకు సగటున 82 వేల మందికి దర్శనం కల్పించామని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా సమర్థవంతమైన టైమ్ మేనేజ్‌మెంట్ ద్వారా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Additional EO Venkaiah Chowdary Tirumala News Tirumala Summer Crowd Management TTD Summer Arrangements 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.