📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Iran: నన్ను టార్గెట్ చేస్తే..దేశాన్ని భూమిపై లేకుండా చేస్తా..ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 21, 2026 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump), ఇరాన్ మధ్య దశాబ్దాల కాలంగా ఉన్న వైరం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తనను హతమార్చేందుకు ఇరాన్ కుట్ర పన్నుతోందనే వార్తలు ఎక్కువవుతున్న క్రమంలో.. ట్రంప్ ఆ దేశానికి అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ తనపై దాడికి ప్రయత్నిస్తే.. ఆ దేశాన్ని భూమి మీదే లేకుండా తుడిచి పెట్టాలని తన అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “నాకు చాలా స్పష్టమైన సూచనలు ఉన్నాయి. నాకు ఏమైనా జరిగితే.. ఇరాన్‌ను ఈ భూమి మీద నుంచి తుడిచి పెట్టేయండి అని నా సైనిక సలహాదారులకు చెప్పాను” అని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఒక రోగిగా అభివర్ణించిన ట్రంప్.. ఇరాన్‌కు కొత్త నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు.

Read Also: AP: దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ .. భారీ పెట్టుబడులే లక్ష్యం

Iran: నన్ను టార్గెట్ చేస్తే..దేశాన్ని భూమిపై లేకుండా చేస్తా..ట్రంప్

ధీటుగా స్పందించిన ఇరాన్

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబుల్ ఫజల్ షేకర్చి ధీటుగా స్పందించారు. “మా నాయకుడిని ఎవరైనా తాకాలని చూస్తే.. ఆ చేతిని నరకడమే కాదు వారి ప్రపంచాన్నే పూర్తిగా తగులబెడతాం” అని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా యుద్ధ వాతావరణానికి దారితీస్తోంది. గత ఏడాది కాలంగా ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభంపై జరుగుతున్న నిరసనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం.. ఈ ఆందోళనల్లో ఇప్పటి వరకు 4,519 మంది పౌరులు మరణించారు. సుమారు 26,300 మందిని ఇరాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ మరణాలకు అమెరికానే కారణమని ఖమేనీ ఆరోపిస్తుండగా.. శాంతియుత నిరసనకారులను చంపడం సరికాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే కొనసాగితే.. తమ దేశం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

donald trump warning global security concerns international tensions Telugu News online Telugu News Today Trump controversial remarks Trump strong statement US political rhetoric

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.