📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: మా మాట వినకుంటే యుద్ధమే చూస్తారు: ట్రంప్ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: February 28, 2026 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​, అమెరికా దళాలు సైనిక చర్యలు ప్రారంభించాయి. ఆ ఆపరేషన్​ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) స్వయంగా ధ్రువీకరించారు. ఇరాన్​ మళ్లీ తన అణుసామర్థ్యాన్ని పెంపొందించుకోకుండా అడ్డుకోవడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తమ మాట వినకుంటే ఇరాన్​ను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా పెద్దఎత్తున యుద్ధ కార్యకలాపాలకు దిగిందని ట్రంప్ పేర్కొన్నారు. తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి, క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అందువల్లే ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ సైనిక చర్య చేపట్టామని స్పష్టం చేశారు.

read Also: Worlds Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన నుంచి జాలువారుతున్నకృత్రిమ జ‌ల‌పాతం

If you don’t listen to us, you will see war: Trump warns

ఇరాన్‌ ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యం

ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్‌ అతిపెద్ద మద్దతుదారని ట్రంప్ మండిపడ్డారు. ఇటీవల నిరసనలు చేపట్టిన తన సొంత పౌరులనే అక్కడి ప్రభుత్వం వీధుల్లో దారుణంగా చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండడం ప్రమాదకరమని చెప్పారు. అందువల్లే వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇరాన్‌ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఇకనైనా అణ్వాయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. లేదంటే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. లక్ష్యాలు: నివేదికల ప్రకారం, ఇరాన్‌లోని నటాంజ్ (Natanz) మరియు ఫోర్డో (Fordow) వంటి కీలక అణు ఇంధన శుద్ధి కేంద్రాలే ప్రధాన లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. క్షిపణి వ్యవస్థలు: అణు స్థావరాలతో పాటు ఇరాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణి నిల్వలు మరియు ప్రయోగ కేంద్రాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రభావం: ఈ దాడుల వార్తతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రిడ్ ఆయిల్ (Crude Oil) ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఉద్రిక్తతలు పెరగొచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump War Warning global geopolitics Telugu News Paper Telugu News Today Trump Military Threats Trump Peace Through Strength US Foreign Policy 2026 White House Ultimatum

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.