US: మా లక్ష్యాలన్నీ సాధించే వరకు ఇరాన్​పై యుద్ధం ఆపబోము: ట్రంప్

Read Time:  1 min
మా లక్ష్యాలన్నీ సాధించే వరకు ఇరాన్​పై యుద్ధం ఆపబోము: ట్రంప్
మా లక్ష్యాలన్నీ సాధించే వరకు ఇరాన్​పై యుద్ధం ఆపబోము: ట్రంప్
FONT SIZE
GET APP

తమ లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్​పై అమెరికా చేపట్టిన ఆపరేషన్​ను కొనసాగిస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్​ ఫ్యూరీని పూర్తి శక్తితో కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్​ మీడియా ట్రూత్​లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మరోవైపు ఇజ్రాయెల్​ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ఇరాన్​పై నిర్ణయాత్మక దెబ్బ కొడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఈ మేరకు ట్రెహాన్​పై దాడిని మరింత పెంచాలని తమ దళాలకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

Read Also: Iran Attack: అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు!

We will not stop the war on Iran until we achieve all our goals: Trump
We will not stop the war on Iran until we achieve all our goals: Trump

భారీ సైనిక దాడి..

గత 36 గంటల్లో అమెరికా, మిత్ర దేశాలు కలిసి ప్రపచంలో ఎప్పుడూ చూడని స్థాయిలో భారీ సైనిక దాడిని ప్రారంభించాయని ట్రంప్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇంతటి ఆపరేషన్‌ను ఎవరూ చూడలేదని తెలిపారు. అమెరికా దళాలు ఇరాన్‌లో వందలాది లక్ష్యాలపై దాడులు జరిపాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్​ (ఐఆర్​జీసీ) కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయని చెప్పారు. కొన్ని నిమిషాల్లోనే తొమ్మిది నౌకలను, వాటి నౌకా నిర్మాణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అత్యంత దుర్శార్గుడుగా విమర్శిస్తూ, అనేక మంది అమెరికన్ల రక్తం ఖమేనీ చేతుల్లో ఉందని ట్రంప్ అన్నారు. ఖమేనీ మరణ వార్త వెలువడిన తర్వాత ఇరాన్ అంతటా ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారని ట్రంప్ అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల్ని స్మరించుకుంటున్నామని అన్నారు. ఇరాన్​ వివాదం ముగిసే లోపు ఇంకా ప్రాణ నష్టాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారి మరణాలకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.