📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

White House: రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 19, 2026 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాటో కూటమిలో చీలిక క్రమంగా పెరుగుతోంది. డెన్మార్క్‌ దేశంలోని గ్రీన్‌లాండ్‌ (Greenland) ద్వీపంపై అమెరికా వైట్‌హౌస్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇక రష్యా ముప్పు నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తిని కల్పిస్తామని వెల్లడించింది. రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌‌కు ముప్పు ఉందని గత 20 ఏళ్లుగా నాటో కూటమి చెబుతున్నా డెన్మార్క్ పట్టించుకోలేదని ఆరోపించింది. గ్రీన్‌లాండ్ భద్రత కోసం ఇప్పటిదాకా డెన్మార్క్ ఏమీ చేయలేకపోయిందని వైట్‌హౌస్ పేర్కొంది. ఇక గ్రీన్‌లాండ్‌కు భద్రత కల్పించే సమయం వచ్చేసిందని, ఆ పనిని చేస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు సందేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ క్లిప్పింగ్‌తో వైట్‌హౌస్ సోమవారం ఉదయం ఈ ట్వీట్ చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి జనవరి 23 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు సందర్భంగా ట్రంప్‌తో నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ ర్యూట్ భేటీ కానున్న వేళ వైట్‌హౌస్ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Read Also: Karur Stampede: సీబీఐ విచారణకు హాజరైన విజయ్

White House: రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

గ్రీన్‌లాండ్ ముమ్మాటికీ డెన్మార్క్ దేశ భూభాగమే

డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్ ద్వీపం తమ వ్యూహాత్మక ఆర్థిక, భద్రతా ప్రయోజనాలకు ముఖ్యమైందని, దాన్ని అమెరికా తీసుకుంటామంటే కుదరదని ఐరోపా దేశాలు వాదిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ ముమ్మాటికీ డెన్మార్క్ దేశ భూభాగమే అని అవి తేల్చి చెబుతున్నాయి. ఈవిషయంలో మిత్రదేశం డెన్మార్క్‌కు అండగా నిలుస్తామని అంటున్నాయి. ఈమేరకు డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యూకే, జర్మనీ ఇప్పటికే ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇటీవలే గ్రీన్‌లాండ్‌లో డెన్మార్క్‌- ఐరోపా దేశాలు కలిసి నిర్వహించిన ఆర్కిటిక్ ఎండ్యురన్స్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాన్నీ హెచ్చరించేందుకు కానే కాదని తేల్చి చెప్పాయి. కేవలం డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రజలకు పూర్తి సంఘీభావంగా నిలిచేందుకే ఆ విన్యాసాలు చేసినట్లు 8 ఐరోపా దేశాలు స్పష్టం చేశాయి.
గ్రీన్‌లాండ్‌పై ఐరోపా దేశాల సంయుక్త ప్రకటన విని అగ్గి మీద గుగ్గిలమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునేందుకు అంగీకారం తెలిపే వరకు ఆ 8 ఐరోపా దేశాలపై దిగుమతి సుంకాలను విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాతో విభేదిస్తే 2026 ఫిబ్రవరి 1 నుంచి ఆ ఎనిమిది ఈయూ దేశాలపై 10 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Arctic security Donald Trump Geopolitics Global Politics Greenland International Relations russia Strategic Territories Telugu News online Telugu News Today US foreign policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.