అమెరికా న్యాయ వ్యవస్థ అధర్మం పై గర్జించింది. అన్యాయంపై తిరగబడింది. నడుస్తున్న అమెరికా అర్థరహిత టారిఫ్ చరిత్రకు అర్థవంత మైన ముగింపు నిచ్చింది. 9 మంది న్యాయమూర్తులు గల అమెరికా ధర్మా సనం 6:3 వ్యత్యాసంతో అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్లు చెల్ల వంటూ విస్పష్టమైన తీర్పు నిచ్చింది. సుప్రీం తీర్పుట్రంప్ అహంకారంపై సంధించిన అస్త్రంగా భావించాలి. ట్రంప్ (Trump)విధానాలు అమెరికా భవిష్యత్తుకు శరాఘాతంగా మారిన నేపథ్యంలో వెలువడిన సుప్రీం నిర్ణయాన్ని ట్రంప్ (Trump)శిరోధార్యంగా భావించక తప్పదు. అయితే తాజా పరిణా మాలు ట్రంప్ అహాన్ని దెబ్బతీయడంతో చేసేదేమీ లేక పైకి డాంభికం ప్రదర్శిస్తూ, సుప్రీం తీర్పును తప్పుబడుతూ, సరి కొత్త టారిఫ్లతో మరో నాటకానికి తెరదీసి, తన అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యమున్న అమెరికా ప్రజాస్వామ్య చరిత్రకు, రాజ్యాంగ వ్యవస్థకు డోనాల్డ్ ట్రంప్ పాలన ఒక మాయని మచ్చగా మారింది. ట్రంప్ పాలన పిచ్చోడి చేతి లో రాయిలా పరిణమించింది. పరుల పొట్టగొట్టి తన దేశ ఆర్థిక సౌధానికి పునాదులు వేసుకోవాలనుకోవడం అనుచి తం. ఇతర దేశాల బలహీనతలను తమకు అనుకూలంగా
మలచుకుని, టారిఫ్ తో బెదిరించి, దారికి తెచ్చుకోవడం అత్యంత దుర్మార్గం. న్యాయమూర్తులను కూడా బెదిరించి, ఏదో సాధించాలనుకున్న ట్రంప్కు తీవ్ర నిరాశ ఎదురైనది. ట్రంప్ నామినేట్ చేసిన ఇరువురు న్యాయమూర్తులు కూడా టారిఫ్లను వ్యతిరేకిస్తూ న్యాయాన్ని నిలబెట్టడంలో నిష్పక్ష పాతంగా వ్యవహరించారు. ట్రంప్విధించిన టారిఫ్లవలన అమెరికాలో ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంది. అమెరికా ప్రజల బ్రతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిపోయాయి. అమె రికాలో నిరుద్యోగం ప్రబలింది. ఈ అంశాలను పక్కన బెట్టి తాను విధించిన ప్రతీకార సుంకాల వలనే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడిందని ట్రంప్ బుకాయించడం విడ్డూరం.
Read Also : Siddiq: UK శాసనసభ్యుడు సిద్ధిక్ పై బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు
టారిఫ్ వ్యూహాల ఫలితం
భారతీయ వస్తువులపై అమెరికా 50శాతం సుంకాలు విధించగా, అందులో 25 శాతం రష్యా నుండి చమురు కొంటున్నందుకు భారత్ పై అమెరికా అదనంగా విధించిన సుంకం. ఇటీవల ఇండో యు.ఎస్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్లో రష్యా చమురు కొనుగోలు నిలిపి వేస్తామనే కారణంగా భారత్ ఎగుమతి చేసే వస్తువులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గించడం జరిగింది. అయితే ఇప్పుడు వెలువడిన తీర్పు వలన భారత్పై 15 శాతం సుంకాలు వర్తిస్తాయని అమెరికా చెబుతున్నా, ఆఖరికి జీరో సుంకాలే భారత్కు వర్తించే పరిస్థి తులు రావచ్చు. అయితే ఇంకా సంతకాలు కూడా జరగని ట్రేడీల్ కు సంబంధించిన ఫ్రేమ్వర్క్ లో మార్పులకు భారత్ పట్టుబడుతుందా? లేక ట్రంప్ వత్తిడికి తలొగ్గి ట్రేడీల్ యథాతథంగా కొనసాగిస్తుందా? అనే అంశం పై త్వరలోనే స్పష్టత రావచ్చు. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లపై అమెరికా న్యాయస్థానంలో వాదనలు ముగిసి తీర్పు వచ్చే తరుణంలో అమెరికాతో భారత్ హడావిడిగా ట్రేడ్ డీల్కుదుర్చు కోవడంలో భారత్ వ్యూహాత్మక తప్పిదం చేసింది. అనేక దేశాలు ఇప్పటికే ట్రంపు లెక్కచేయ కుండా, ట్రంప్ వత్తిడికి లొంగకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటివరకు ట్రంప్ విధించిన టారిఫ్లు అంతి మంగా అమెరికా ప్రజలను కకావికలం చేసాయి. ట్రంప్ టారిఫ్ వ్యూహాల ఫలితంగా ఇప్పటివరకు సుమారు 175 బిలియన్ డాలర్లు అమెరికా ఖాతాలో చేరినట్టు అంచనా. ఈ మొత్తం అమెరికా రీఫండ్ చేస్తుందా? ఎవరికి రీఫండ్ చేస్తుంది? అమెరికా ప్రజలకా? దిగుమతి చేసిన దేశాలకా? కంపెనీలకా? ఒకవేళ సుంకాలను తిరిగి చెల్లిస్తే, ఇప్పటికే అప్పులతో, డాలర్ ఆధిపత్యంతో బెదిరిస్తూ నెట్టుకొస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముంది. అమెరికా ప్రజలు దారుణ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఈ డబ్బంతా తిరిగి ఇవ్వగలిగే స్థితిలో అమెరికా లేదు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్ తో హడలెత్తిపోయిన అమెరికా ప్రజలు సుప్రీం తీర్పుతో తమపై విధించిన పన్నులను రీఫండ్ చేయాలని వాదిస్తున్నారు. పలు కార్పొరేట్ కంపెనీలు, అమెరికాలోని వివిధ రాష్ట్రాలు రీఫండ్ కోసం డిమాండ్ చేస్తున్నాయి.
పరుష పదజాలం
అయితే ట్రంప్ మాత్రం టారిఫ్ల భారం అమెరికా ప్రజలపై పడలేదని, అమెరికాకు తమ వస్తూత్పత్తులను ఎగుమతి చేసిన దేశాలపై మాత్రమే పడిందని చెప్పడం అతిశయోక్తి గా చెప్పక తప్పదు. తనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగంలో ట్రంప్ న్యాయమూర్తు లను అభ్యంతరకరమైన, పరుష పదజాలంలో దూషించడం తగని పని. న్యాయస్థానం మీద కోపంతో ట్రంప్ ౫ నెలలపాటు అమల్లో ఉండేలా విదేశీ వస్తువులపై 15శాతం సుంకాలు విధిస్తూ హడావిడిగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసారు. ఈ నేపథ్యంలో భారత్ అమెరికాల మధ్య జరగవలసిన-వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. తమకు భారత్ 15శాతం సుం కాలు చెల్లించాలని, తమకు మాత్రం జీరో సుంకాలు వర్తిస్తా యని ట్రంప్ చెప్పడం వాణిజ్య ఒప్పందంలోని అన్యాయాన్ని, అసమతుల్యతను సూచిస్తున్నది. అమెరికాకు చెందిన ప్రఖ్యా త ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తాజా పరిణామాల దృష్ట్యాభారత్ పాత ఒప్పందాన్ని వదిలేసి, అమెరికాతో సరికొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని చేసిన సూచనను భారత్ పరిగణలోకి తీసుకోవాలి. ట్రంప్ కూడా టారిఫ్ల విషయంలో పట్టువిడు పు ధోరణి ప్రదర్శించడం మంచిది. ఇప్పటికే అమెరికా ప్రజ లు, రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ట్రంప్ పట్ల విసిగి వేసారి పోయారు. కొద్దినెలల్లో జరిగే యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ చాప చుట్టేసే అవకాశముంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ సంవత్సర కాలంలోనే ప్రజల మద్దతు కోల్పోయారు. కేవలం 39 శాతం ప్రజల మద్దతు గల ట్రంప్ చరిత్రలో అత్యంత చెడ్డ వ్యక్తిగా మిగిలి పోయే అవకాశముంది. ఏది ఏమైనా ట్రంప్ పూర్తికాలం అధికారంలో కొనసాగడం దుర్లభం. ట్రంపును ఇంపీచ్ చేసే అవకాశాలు పుషలంగా ఉన్నాయి. ప్రస్తుత తీర్పుకేవలం అమెరికన్లకు మాత్రమే కాకుండా అమెరికాకు తమ వస్తువులు ఎగుమతి చేస్తున్న పలుప్రపంచ దేశాలకు భారీ ఊరట కలిగించిందనే చెప్పాలి.
సుంకాలను విధించే హక్కు కాంగ్రెస్కే
సుంకాలను విధించే హక్కు కాంగ్రెస్కే ఉందని, అధ్యక్షుడికి లేదని అమె రికా సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో భారత దేశం ఈ విషయంలో ఏం చేస్తుందో చెప్పలేం. వాణిజ్య ఒప్పందం పై భారత్ పునరాలోచించాలి. ఇరు పక్షాలు జీరో సుంకాలనే అమలు చేయాలి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొంటున్న భారత్లోస్ఈయూ దేశాల మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్వెంటనే అమలు జరగాలని, వీలైతే ఈ జూలై నుంచే అమ ల్లోకి రావాలని ఈయూ దేశాలు బలంగా వాంఛిస్తున్నాయి. భారత్ అమెరికాల మధ్య కుదిరిన ఇంటిరిమ్ ట్రేడ్ డీల్ పరిస్థితి డోలాయమానంగా మారింది. ప్రస్తుత పరిస్థి తులను విశ్లేషిస్తున్నామని, భారత్ పేర్కొన్నా, భారత్ పై 15శాతం టారిఫ్లు కొనసాగుతాయని ట్రంప్ ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఇందుకు అంగీకరిస్తుందా? లేదా ఫ్యాక్ట్ షీట్లో ట్రంప్ మరిన్ని మార్పులు చేస్తారా? వేచిచూడాలి. టారిఫ్ల వలన అమెరికా లో నిరుద్యోగం తగ్గిందని, స్టాక్ మార్కెట్లు దూసుకు పోతు న్నాయని, సుప్రీం తీర్పు అమెరికా ప్రయోజనాలకు భంగకరమని, ఇందులో విదేశీ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంటూ, న్యాయమూర్తులను మూర్ఖులుగాను, స్వప్రయో జనాల కోసం లొంగిపోయి తీర్పు నిచ్చారని వాదించడం ట్రంప్ మూర్ఖత్వానికి పరాకాష్ట. గతంలో కూడా ఇలాగే న్యాయమూర్తులను విమర్శించినప్పుడు హద్దు\ దాటితే అధ్య క్షుడినైనా అరెస్టు చేస్తామంటూ హెచ్చరించిన విషయాన్ని మరచి ట్రంప్ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అమెరికా అత్యున్నత న్యాయవ్యవస్థను, చారిత్రాత్మక ప్రజాస్వామ్య ఈ కోవలోకే వస్తుందని, తాము భారత్కు సుంకాలు చెల్లించబోమని, భారత్ మాత్రం తమకు సుంకా లను చెల్లించాలనే వితండవాదంతో ట్రంప్ ఇంకా అహం భావం ప్రదర్శిస్తున్నారు. ఏదిఏమైనా ట్రంప్ పాలన అమెరికా చరిత్రలో ఒక దుస్స్వప్నంగా మిగిలిపోయే అవకాశముంది.
-సుంకవల్లి సత్తిరాజు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: