📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

US Visa: 75 దేశాల వీసాలను ఫ్రీజ్ చేసిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 16, 2026 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ లేదా పర్మినెంట్ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో తన ఉక్కుపాదాన్ని మోపింది. ఏకంగా 75 దేశాలకు చెందిన పౌరులకు ‘ఇమ్మిగ్రెంట్ వీసాలను’ నిరవధికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల ఎవరికి నష్టం? ఇండియా పరిస్థితి ఏంటి? సంచలన నిర్ణయం: జనవరి 21 నుంచే అమలు! అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 21 నుండి పాకిస్తాన్, రష్యా, థాయ్‌లాండ్, ఇరాన్, బ్రెజిల్ వంటి దాదాపు 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తున్నారు. అమెరికా పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (Green Card) కోరుకునే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. అమెరికాలోని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సాయంపై ఆధారపడే అవకాశం ఉన్నవారిని అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

Read Also: Iran: ఇప్పుడప్పుడే దాడి లేదన్న ట్రంప్

US Visa: 75 దేశాల వీసాలను ఫ్రీజ్ చేసిన ట్రంప్

ఎందుకీ వీసాల నిలిపివేత?

దీని వెనుక పబ్లిక్ చార్జ్ అనే కీలకమైన నిబంధన ఉంది. అంటే ఎవరైనా విదేశీయుడు అమెరికాకు వచ్చి అక్కడి ప్రభుత్వ ధనం మీద ఆధారపడి బతుకుతారని అనిపిస్తే.. వారికి వీసా నిరాకరించే అధికారం కన్సులర్ అధికారులకు ఉంటుంది. వయస్సు, ఆరోగ్యం: వృద్ధులు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వీసా రావడం కష్టమే. ఆర్థిక స్థితి: అప్లై చేసే వ్యక్తి ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాడో గమనిస్తారు. భాషా నైపుణ్యం: ఇంగ్లీష్ రాకపోయినా, సరైన చదువు లేకపోయినా వీసా తిరస్కరించే అవకాశం ఉంది. గత రికార్డు: గతంలో ఎప్పుడైనా ప్రభుత్వ నగదు సాయం పొంది ఉన్నా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రభావితమయ్యే దేశాలు ఇవే.. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఇవే కాకుండా రష్యా, బ్రెజిల్, ఈజిప్ట్, నైజీరియా, థాయ్‌లాండ్ వంటి 75 దేశాల వారిపై ఈ ప్రభావం పడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump visa freeze international travel restrictions Telugu News online Telugu News Today Trump immigration policy US travel ban news US visa restrictions visas frozen for 75 countries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.