అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే చర్చ.. తర్వాతి ‘ఫెడ్ రిజర్వ్’ బాస్ ఎవరు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో సస్పెన్స్ ను పెంచుతూ, కొత్త ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పేరును ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, మాజీ ఫెడ్ గవర్నర్ కేవిన్ వార్ష్ (Kevin Warsh) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బాండ్ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎవరీ కేవిన్ వార్ష్? ట్రంప్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు? కేవిన్ వార్ష్ ఆర్థిక రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. 2006 నుండి 2011 వరకు ఆయన ఫెడరల్ రిజర్వ్ బోర్డులో గవర్నర్ గా పనిచేశారు. విశేషమేమిటంటే కేవలం 35 ఏళ్ల వయసులోనే ఈ పదవిని చేపట్టి ఫెడ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.
ట్రంప్ గతంలోనే జెరోమ్ పావెల్ స్థానంలో ఈయన్ని నియమించాలని అనుకున్నారు, కానీ 2017లో అది కుదరలేదు.
Read Also: USA: తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక
ట్రంప్ అధికారిక ప్రకటన కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూపులు
ఇప్పుడు మరోసారి వార్ష్ వైపు ట్రంప్ (Trump) మొగ్గు చూపడం వెనుక బలమైన కారణం ఉంది. సాధారణంగా వార్ష్ ను ‘ఇన్‌ఫ్లేషన్ హాక్’ (ద్రవ్యోల్బణంపై కఠినంగా ఉండేవారు) అని పిలుస్తారు, కానీ ఇటీవల ఆయన తన పంథా మార్చుకున్నారు. వడ్డీ రేట్లను తగ్గించాలన్న ట్రంప్ ఆలోచనలతో ఆయన ఏకీభవిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. మార్కెట్ల స్పందన ఎలా ఉంది? వార్ష్ పేరు వినిపించగానే మార్కెట్లు కాస్త ఆందోళనకు గురయ్యాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి, అలాగే డాలర్ విలువ పుంజుకుంది. అదే సమయంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇన్వెస్టర్లు ఇప్పుడు ట్రంప్ అధికారిక ప్రకటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఫెడ్ గవర్నర్‌గా క్రిస్టోఫర్ వాలర్
రేట్ల తగ్గింపుపై ట్రంప్ ఒత్తిడి ప్రస్తుత ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ట్రంప్ (Trump) మాత్రం వడ్డీ రేట్లను వేగంగా తగ్గించాలని కోరుకుంటున్నారు. దీనివల్ల సామాన్యులకు రుణాలు చౌకగా లభిస్తాయని, తద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుతుందని ఆయన నమ్మకం. వార్ష్ గనుక పగ్గాలు చేపడితే ట్రంప్ ఆశించిన విధంగా వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్. క్రిస్టోఫర్ వాలర్: ప్రస్తుతం ఫెడ్ గవర్నర్‌గా ఉన్నారు. రిక్ రీడర్: ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ‘బ్లాక్‌రాక్’ ఎగ్జిక్యూటివ్. అయితే, గురువారం వైట్ హౌస్‌లో కేవిన్ వార్ష్ నేరుగా ట్రంప్‌ను కలవడంతో, ఆయనకే పదవి దక్కే అవకాశాలు 90% వరకు ఉన్నాయని ప్రిడిక్షన్ మార్కెట్లు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: