📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్‌

Author Icon By Vanipushpa
Updated: January 12, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయన మరోసారి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన పోస్ట్ చేశారు. ఆయన తనను తాను వెనిజులా “యాక్టింగ్ ప్రెసిడెంట్” అని చెప్పుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించారు. ట్రంప్ అధికారిక ఫోటోతో పాటు ఉన్న ఆ పోస్ట్‌లో, తాను ప్రస్తుతం వెనిజులా “యాక్టింగ్ ప్రెసిడెంట్” అని పేర్కొన్నారు. జనవరి 20, 2025న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన తనను తాను యునైటెడ్ స్టేట్స్ యొక్క 45వ మరియు 47వ అధ్యక్షుడిగా కూడా పరిచయం చేసుకుంటున్నారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ఖాతాలో ఓ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్‌ చేశారు. వికీపీడియా పేజీని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్‌ ఫొటో అది. అందులో ట్రంప్‌ (Donald Trump) ఫొటో కింద.. ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: Russo-Ukrainian War : ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్‌

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో దాడి

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో ఇటీవల వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులకు దిగిన సంగతి తెలిసిందే. రాజధాని కారకాస్‌పై విరుచుకుపడిన అగ్రరాజ్య బలగాలు.. ఆ దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను నిర్బంధించి అమెరికాకు తరలించాయి. ఇప్పుడు న్యూయార్క్‌లో నిర్బంధంలో ఉన్నారు, నార్కో-టెర్రరిజం ఆరోపణలపై న్యాయపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాల అనంతరం వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్‌ డెల్సీ రోడ్రిగ్జ్‌ బాధ్యతలు చేపట్టారు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని వెనెజువెలా రక్షణమంత్రి వెల్లడించారు. అయితే వెనెజువెలా పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆ దేశ విపక్ష నేత, నోబెల్‌ పురస్కార గ్రహీత మచాడోను ఎన్నుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆమెకు బాధ్యతలు ఇచ్చేందుకు ట్రంప్‌ విముఖత చూపించడం గమనార్హం. మచాడోకు ప్రజల్లో అంత మద్దతు లేదని అమెరికా అధ్యక్షుడు ఇటీవల అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Donald Trump Interim President Claim International Relations Latin America News Telugu News online Telugu News Today US foreign policy Venezuela Crisis Venezuela Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.