📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India-Pak: యుద్దాన్ని ఆపి ‘కోటి’ మందిని కాపాడాను : ట్రంప్​

Author Icon By Vanipushpa
Updated: January 17, 2026 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి పాడిన పాటే పాడారు. భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగకుండా తానే అడ్డుకున్నానని, అందువల్ల కోట్లాది మంది ప్రాణాలు కాపాడినట్లు ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా తనకు కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు. శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) సదర్న్ బులేవార్డ్‌ను ‘డొనాల్డ్ జే ట్రంప్ బులేవార్డ్’గా పేరు మార్చిన కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “గత ఏడాది కాలంలో మేం ఎనిమిది శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంది. భారత్– పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని కూడా మేం ఆపాం. రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. కానీ మేం ఆపేశాం” అని ట్రంప్ అన్నారు. అలాగే పాకిస్థాన్ ప్రధాని తనతో మాట్లాడుతూ, “డొనాల్డ్ ట్రంప్ కనీసం ఒక కోటి మంది ప్రాణాలు కాపాడారు” అని చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.

Read Also: Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ

India-Pak: యుద్దాన్ని ఆపి ‘కోటి’ మందిని కాపాడాను : ట్రంప్​

యుద్ధాలు ఆపిన వారికి నోబెల్ బహుమతి

భారత్- పాక్ శాంతి విషయంలో తన పాత్రను ప్రస్తావిస్తూ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతి అంశాన్ని కూడా లేవనెత్తారు. యుద్ధాలు ఆపిన వారికి నోబెల్ ఇవ్వాలని, అయితే తనకు మాత్రం రాజకీయ కారణాలతో ఆ గౌరవం దక్కలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. మే 10 నుంచి ట్రంప్ పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా, వెనిజువెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మాచాడో ఇటీవల ట్రంప్‌తో వైట్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ట్రంప్‌నకు అందజేశారు. అయితే, నోబెల్ కమిటీ మాత్రం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఒకసారి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన తర్వాత దాన్ని ఇతరులకు బదిలీ చేయడం, పంచుకోవడం లేదా ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని తెలిపింది. మెడల్ ఇచ్చినా, అసలు పురస్కారం గ్రహీతదే అని నోబెల్ సంస్థ స్పష్టం చేసింది.

ఖండించిన భారత్

ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తీసుకుంది. భారత్- పాకిస్థాన్ మధ్య శాంతి ఒప్పందంలో మూడో దేశం పాత్ర లేదని భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పరోక్షంగా ఖండిస్తోంది. 2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’​ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ పరిణామాల అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారగా, మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత్ DGMOను సంప్రదించి కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసినట్లు భారత అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump statement global conflict prevention Telugu News online Telugu News Today Trump international diplomacy Trump political news Trump war claim US foreign policy news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.