ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మేనియా నడుస్తోంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీని నడపాలంటే భారీ డేటా సెంటర్లు కావాలి, వాటికి విపరీతమైన విద్యుత్ అవసరం. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం.. ప్రముఖ ఐటీ కంపెనీలకు(IT companies) ఒక కీలక ఆదేశం జారీ చేసింది. ఏఐ మౌలిక సదుపాయాల వల్ల పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తట్టుకోవడానికి, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును ఆయా కంపెనీలే భరించాలని ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.
Read Also: Rangrez: పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
టెక్ కంపెనీలపై భారం ఎందుకు?
అమెరికాలోని ప్రధాన గ్రిడ్ నెట్‌వర్క్‌లైన ‘PJM Interconnection’ వంటి వాటిపై డేటా సెంటర్ల వల్ల విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దాదాపు 6.5 కోట్ల మందికి విద్యుత్ అందించే ఈ వ్యవస్థలో ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ పెరగడం వల్ల సామాన్య వినియోగదారుల విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం.. డేటా సెంటర్ల డిమాండ్ వల్ల దాదాపు 23 బిలియన్ డాలర్ల అదనపు సామర్థ్య ఖర్చులు పెరిగాయి. ఈ భారాన్ని సాధారణ గృహ వినియోగదారులు లేదా చిన్న వ్యాపారస్తుల మీద వేయకుండా, డిమాండ్ కు కారణమైన ఐటీ కంపెనీలు (IT companies) భరించాలని పాలసీదారులు వాదిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: