📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

US: ఇవీ ట్రంప్ ‘బోర్డు ఆఫ్‌ పీస్‌’ రూల్స్‌..

Author Icon By Vanipushpa
Updated: January 20, 2026 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంలో గాజా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్‌నిర్మించడం కోసం ఇటీవల ట్రంప్‌ ”బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌”ను ఏర్పాటు చేశారు. అయితే ఇది కేవలం గాజా వ్యవహారాని మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతలను పరిష్కరించే దిశగా ఈ బోర్డును విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌లో శాశ్వత సభ్యత్వం కావాలనుకునే దేశాలు తమకు 1 బిలియన్‌ అమెరికా డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ”బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌”కు(Board of Peace) ఛైర్మన్‌గా ట్రంప్‌ (Trump) వ్యవహరిస్తున్నారు. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం లేదా ముప్పు ఉన్న ప్రాంతాల్లో స్థిరత్వం, నమ్మకమైన, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

Read Also: Portugal elections 2026 : పోర్చుగల్ అధ్యక్ష ఎన్నికలు నేడు, కొత్త చరిత్ర రాయనా?

US: ఇవీ ట్రంప్ ‘బోర్డు ఆఫ్‌ పీస్‌’ రూల్స్‌..

అమెరికాకు ప్రారంభ ప్రతినిధిగా విడిగా ట్రంప్

ఈ సంస్థలో చేరాలని ట్రంప్ యంత్రాంగం దాదాపు 60 దేశాలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్‌ ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించడమే కాక అమెరికాకు ప్రారంభ ప్రతినిధిగా విడిగా సేవలందిస్తారు. బోర్డు ఆఫ్ పీస్ లక్ష్యాలు నెరవేర్చేందుకు అనుంబంధ సంస్థలను ఏర్పాటు చేయడం, మార్చడం లేదా రద్దు చేసే అధికారం ఛైర్మన్‌కు ఉంటుంది. ఈ బోర్డులో చేరిన సభ్యదేశాలకు మూడేళ్ల పాటు పదవీకాలం ఉంటుంది. అయితే ఛైర్మన్‌ వీళ్లను ఎప్పుడైనా తొలగించే అధికారం ఉంటుంది. బోర్డ్ ఆఫ్ పీస్ తరపున ట్రంప్ స్వయంగా తీర్మానాలు చేయడం లేదా ఇతర ఆదేశాలను జారీ చేయవచ్చు. ఇందులో ఛైర్మన్‌ను మార్చడమనేది దాదాపు అసాధ్యమే.

ప్రతి సభ్య దేశానికి ఇందులో ఒక ఓటు

బోర్డు ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే ఏ దేశమైతే 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్లు) నగదును విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది. అంటే మూడేళ్ల కాల పరిమతి అనేది వర్తించదు. ఇక ఈ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకునే ‘ఎగ్జిక్యూటివ్ బోర్డ్’ సభ్యుల పదవీ కాలం మాత్రం రెండేళ్లు ఉంటుంది. అంతేకాదు ఈ బోర్డులో ఏటా ఓటింగ్‌ సమావేశాలు కూడా జరుగుతాయి. ప్రతి సభ్య దేశానికి ఇందులో ఒక ఓటు ఉంటుంది. ఇందులో ఏదైనా నిర్ణయం ఆమోదం పొందాలంటే, సమావేశానికి హాజరై ఓటు వేసిన సభ్య దేశాలలో మెజారిటీ అంటే సగాని కన్నా ఎక్కువ మద్దతు ఉండాలి.

Read Also: Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

administration decisions Board of Peace Donald Trump governance guidelines International Affairs political directives Telugu News online Telugu News Today trump rules US policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.