📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

USA: లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన

Author Icon By Vanipushpa
Updated: January 13, 2026 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తూ వస్తున్నారు. ముందుగా వీసాపై తీసుకున్న చర్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ చేపట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్ అమలు చర్యలలో భాగంగా US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ భారీ స్థాయిలో వీసా రద్దులకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు, ప్రత్యేక నైపుణ్య కార్మికులు సహా మొత్తం లక్ష కంటే ఎక్కువ వీసాలను ఏడాది కాలంలో రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రజా భద్రత, జాతీయ భద్రతలను ప్రధానంగా ఉద్దేశించి తీసుకున్న చర్యగా ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ట్విట్టర్‌గా ఉన్న X వేదికపై స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ప్రకటనలో.. ఇప్పటివరకు లక్షకు పైగా వీసాలను రద్దు చేసినట్లు వెల్లడించింది.

Read Also: Oslo: నోబెల్‌ మరొకరికి అంకితం చేయడం కుదరదు: కమిటీ

H1-Visa

ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం..

ఈ వీసాలు ప్రధానంగా నేర కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించినవని స్పష్టం చేసింది. అమెరికాను సురక్షితంగా ఉంచేందుకు ఈ దుండగులను దేశం వెలుపలికి పంపించడాన్ని కొనసాగిస్తామని స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టంగా పేర్కొంది. స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగోట్ ప్రకారం ఈ వీసా రద్దులు.. దాడి, దొంగతనం, మద్యం సేవించి వాహనం నడపడం (DUI) వంటి నేరాలకు పాల్పడిన లేదా దోషులుగా తేలిన విదేశీ పౌరులను కవర్ చేస్తున్నాయి. ఒక సంవత్సరంలోపే లక్షకు పైగా వీసాలను రద్దు చేయడం ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలులో కీలకమైన ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. 2025లో రద్దు చేయబడిన వీసాల సంఖ్య చరిత్రలోనే అత్యధికంగా ఉంది. ఇది 2024లో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో రద్దు చేసిన మొత్తం వీసాల సంఖ్య కంటే రెండింతలకు పైగా ఉండటం గమనార్హం చెప్పుకోవచ్చు.

ప్రజా భద్రత, జాతీయ భద్రతకు ప్రాధాన్యత

వీసా రద్దులలో ఎక్కువ భాగం వ్యాపార, పర్యాటక వీసాలతో అమెరికాకు వచ్చినవారు గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే అక్రమంగా ఉండిపోయిన కేసులకు సంబంధించినవిగా విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం, దాడి, దొంగతనం, పిల్లలపై దుర్వినియోగం, మోసం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న వారిపైనా ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. మాదకద్రవ్యాల స్వాధీనం, పంపిణీ కేసులతో సంబంధం ఉన్న దాదాపు 500 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది అంతర్జాతీయ విద్యార్థుల వర్గాల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీసా రద్దుల చర్యలు ట్రంప్ పరిపాలన తీసుకువస్తున్న విస్తృత ఇమ్మిగ్రేషన్ మార్పులలో భాగంగా చోటు చేసుకున్నాయి. అక్రమ వలసలను అరికట్టడం, బహిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు, వీసా జారీకి మరింత కఠినమైన ప్రమాణాలను అమలు చేస్తున్నారు. ప్రజా భద్రత, జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మరింత కఠినతరం చేయడమే ఈ చర్యల లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump mass deportation migrant crisis Student Visas Telugu News online Telugu News Today US Immigration Policy US Politics visa cancellation work visas

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.