Trade agreements : వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

Read Time:  1 min
Trade agreements
Trade agreements
FONT SIZE
GET APP

ప్రపంచీకరణ యుగంలో ప్రస్తుత మన వాణిజ్య విధా నాలు దేశ ఆర్థిక వ్యవస్థలను ఎంత గానో ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి విదేశీ వాణిజ్య ఒప్పందాలు, దిగుమతి ఎగుమతి సుంకాలు, టారిఫ్ యుద్ధాలు నేరుగా రైతుల, కార్మికుల, చిన్న పరిశ్రమలపై ప్రభావం చూపుతాయి. ఇటీవలి సంవత్స రాల్లో భారత ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాన మంత్రి నాయకత్వంలో, అమెరికాతో సంబంధాలు బలపరిచింది. అదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఫస్ట్ విధానంతో టారిఫ్ యుద్ధాలకు శ్రీకారం చుట్టింది. ఈ పరి ణామాలు భారత్ వ్యవసాయం, వస్త్ర పరిశ్రమ, చిన్నమధ్య తరహా పరిశ్రమలకు ఎలా నష్టం కలిగించాయో తెలిసిందే. అమెరికా, చైనా మధ్య జరిగిన టారిఫ్ యుద్ధం ప్రపంచ సరఫరా గొలుసులను కుదిపేసింది. అమెరికా సుమారు చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచితే దానికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. కానీ మన పాలకులు ఆ పని చేయలేకపోయారు. భారతదేశంలో సుమారు 45 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్నారు. వ్యవసాయరంగం స్థూల జాతీయోత్పత్తి లో సుమారు 15 నుండి 18 శాతం వాటా కలిగి ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకోడానికి ఆల్మండ్స్, వాల్నట్స్, సోయాబీన్ ఆయిల్, డి.డి.జి (మొక్కజొన్న ఉప ఉత్పత్తి) పాలు, పాల ఉత్పత్తులకు అనుమతివ్వడం మన దేశ రైతులకు మంచిది కాదు, దీర్ఘకాలంలో దేశానికీ రక్షణ ఉండదు. దిగుమతుల వల్ల మన రైతుకు లాభం తగ్గింది. అసలే కష్టాల్లో ఉన్న రైతుకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుంది మన వాణిజ్య విధానం. సుమారు 27 శాతం అమెరికాకు భారత గార్మెంట్స్ ఎగుమతుల్లో ఉండగా టారిఫ్ మార్పులు, పోటీ కారణంగా బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు తక్కువ సుంకాలతో అమెరికా మార్కెట్లో పోటీ పెరిగింది, బంగ్లాదేశ్, వియత్నాంకు కొన్ని ఉత్పత్తులపై 0-5 శాతం కారణంగా సూరత్, తిరుప్పూర్ వంటి కేంద్రాల్లో కార్మికులకు ఉపాధి లేకుండా పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. ద్వైపాక్షిక ఒప్పందాల్లో పూర్తిగా పారదర్శకత లోపించింది.

Read Also: Anthropic: ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

Trade agreements
Trade agreements

వ్యవసాయ రంగానికి సరైన రక్షణ లేకపోవడం ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూ.టి.ఓ) పరిధిలో సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ ఒప్పం దాల వల్ల భారత్వంటిదేశం, అమెరికా వంటి మహా ఆర్థిక శక్తితో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, తన స్వదేశ ప్రయో జనాలను కాపాడే సమర్థమైన వ్యూహం అత్యవసరం. భారత వైమానిక దళం కోసం 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి రూ.3 లక్షల 25 వేల కోట్ల విలువైన (ఒకటికి 23.00కోట్లు)ప్రతిపాదనను ప్రస్తుత కేంద్ర ప్రభు త్వం ఆమోదించింది. ఇది దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ సముపార్జనగా గుర్తించబడింది. కానీ మొదట 126 విమానాలు అవసరమని భావించగా, కేవలం 36 విమానాలు మాత్రమే కొనుగోలు చేసారు. ప్రస్తుతం ఐ.ఏ.ఎఫ్కు అవ సరమైన స్క్వాడ్రన్ బలం సుమారు 42,కానీ ఉన్నవి 30-32 మాత్రమే. అంటే, రాఫెల్ ఒప్పందం పూర్తి అవసరాన్ని తీర్చలేదని తెలుస్తోంది. ప్రత్యేకంగా పాకిస్థాన్, చైనాపై ఎయిర్ సుపీరియారిటీ, సరిహద్దుల్లో ఆధునిక సాంకేతిక సమతుల్యత బలమోతుంది. ఇంత పెద్దమొత్తాన్ని విద్య, ఆరోగ్యరంగంపై ఖర్చు పెడితే దేశం మరింత బల పడుతుంది. సామాజిక, ఆర్థిక ప్రభావం వలన ఇప్పటికే గ్రామీణ ఆదాయవృద్ధి మందగించింది, వ్యవసాయ వృద్ధి రేటు సుమారు 3-4 శాతంగాను, యువత నిరుద్యోగం రేటు సుమారు 7-8 శాతం మధ్యలో ఉంది. వస్త్ర రంగంలో మహిళలకు ఉపాధి పూర్తిగా తగ్గే అవకాశముంది. అమెరికా మన చమురు సారఫరాలను నిర్దేశించడానికి అనుమతిం చడం ద్వారా భారతదేశ ఇంధన భద్రత లేకుండా, ఎటువంటి వాగ్దానాలు లేకుండా సంవత్సరానికి 100 బిలియన్ల డాలర్ల (సుమారు పదివేల కోట్ల రూపాయల) అమెరికా దిగుమతులను ఎందుకు అంగీకరించాలి. ఈఆర్థిక సంవత్స రం ఏప్రిల్, జనవరికాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 5.85 శాతం పెరిగి 72.46 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 13.87 శాతం పెరిగి 43.92 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొక జొన్నను దిగుమతికి అనుమ తించమని చెప్పి, జంతువులకు దాణా అని చెప్పి (డి.డి.జి) డిస్టిలర్లు ఎండిన ధాన్యాల పేరుతో ఒప్పందంలో ఉండడం మన రైతుల నోట్లో మట్టివేయడమే.

Trade agreements
Trade agreements

మనం రష్యా నుంచి తక్కువ ధరతో క్రూడ్ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంటే, అమెరికా వద్దంటే గంగిరెద్దులా తలూపివెనిజులా నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకుంటామనడం దారుణం. మనము అమెరికాలో 500 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్నామని మనప్రభుత్వం గొప్పలు చెబుతోంది. మన 140కోట్ల ప్రజల జీవితాలను ఇద్దరు వ్యక్తుల కోసంపణంగా పెట్టడం హర్షించదగినది కాదు. నిన్నటి అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ట్రంప్ సుంకాల విధింపు విధానాన్ని కొట్టేస్తూ ఇప్పటివరకు సుంకాల రూపంలో వాసులు చేసిన దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ కోర్టు ను దిగుమతి దారులు ఆశ్రయించి గెలిచారు. ఈ వాణిజ్య ఒప్పందం (Trade agreements)భారతదేశానికి అనుకూలమైన, సమతుల్యతను నిర్వహించడానికిరూపొందించ బడిందిగా కనబడలేదు. అమెరికా వస్తువుల దిగుమతులను నిర్వహిస్తూనే అమెరికాకు దాని వ్యవసాయ ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 2017-2022 మధ్య సుమారు 10-15 లక్షల చిన్న యూనిట్లు మూతపడినట్లు డేటాలు చెబుతున్నాయి. మరి ఇటువంటి ఒప్పందాల వలన చాలా తీవ్రమైన పరిస్థితులను దేశం ఎదుర్కోవలసి వస్తుంది. ప్రశ్నించే వారు దేశద్రోహులైతే మరి మనదేశ భవిష్యత్తును పణంగా పెట్టిన వారిని మనాలి. భారత వాణిజ్య విధానాలు, ఒప్పందాలు(Trade agreements) అంతర్జాతీయ రాజకీయాలకు అనుసంధానమై ఉన్నాయి. అమెరికాతో స్నేహ సంబంధాలు అవసరమే అయినప్పటికీ, దేశీయ వ్యవసాయం, వస్త్ర పరిశ్రమ, చిన్న పరిశ్రమల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కుదుర్చుకునే ఒప్పందాలు దీర్ఘకాలంలో దేశానికే ప్రమాదకరంగా వుండకూడదు.
-డా. ఎ . భాగ్యరాజ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.